
అమరధామం.. కళావిహీనం
పరకాల: నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ యోధుల ప్రతిమలతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న అమరధామం నిర్లక్ష్యానికి గురవుతోంది. కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు తల్లి చంద్రమ్మ స్మారకార్థం పరకాలలో నిర్మించిన అమరధామం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాల్సి ఉండగా.. రోజురోజుకూ నిర్లక్ష్యానికి గురవుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పచ్చని గార్డెన్‌తో అమరధామం 2003లో నిర్మాణం పూర్తి చేసుకుంది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. ఈఅమరధామాన్ని సందర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. అమరధామం నిర్వహణ బాధ్యత మున్సిపాలిటీ తీసుకున్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. రాత్రి వేళల్లో చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయి. పచ్చదనం కనుమరుగవుతోంది. పశువులకు ఆవాసంగా మారుతోంది. పంచాయితీలకు అడ్డగా నిలుస్తోంది. దీంతో అమరధామాన్ని చూసేందుకు వస్తున్న పర్యాటకులకు అక్కడి వాతావరణం ఇబ్బందిని కలిగిస్తోంది.
విరుగుతున్న విగ్రహాలు
అసాంఘిక కార్యకలాపాలు సాగించేందుకు కొందరు విగ్రహాల మధ్యలోంచి అమరధామం లోపలికి చొరబడుతున్నారు. రాత్రి వేళల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. విగ్రహాలు ధ్వంసమవుతున్నాయని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిరుపయోగం
ఓపెన్ జిమ్
లక్షలాది రుపాయలు వెచ్చించి అమరధామం పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు పూర్తిగా విరిగిపోయాయి. 15 రకాల ఓపెన్ జిమ్ పరికరాల్లో కేవలం 2 మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. అదే విధంగా పార్క్‌లో లైటింగ్ సదుపాయం లేకపోవడంతో అమరధామం ప్రాంతమంతా చీమ్మ చీకట్లు కమ్ముకుంటోంది.
శిథిలమవుతున్న విగ్రహాలు.. నిరుపయోగంగా ఓపెన్ జిమ్
పంచాయితీలు, పశువులకు అడ్డా
పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంలో
పాలకుల విఫలం
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి..
మరో జలియన్ వాలాబాగ్ ఘటనను స్మరించుకుంటూ దేశంలో ఎక్కడ లేని విధంగా పరకాలలో నిర్మించిన అమరధామం అభివృద్ధిపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారు. నేటి పాలకులైనా అమరధామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. ఓపెన్ జిమ్‌తో పాటు చిన్నారులు ఆడుకునేందుకు పార్కు ఏర్పాటు చేయాలి.
– ఎడ్ల సుధాకర్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నాయకుడు, పరకాల

అమరధామం.. కళావిహీనం

అమరధామం.. కళావిహీనం

అమరధామం.. కళావిహీనం