
సీతారాములకు ఎదుర్కోళ్లు
హన్మకొండ కల్చరల్: శ్రీసీతారామ తిరుకల్యాణోత్సవం జరిపించేందుకు నగరంలోని అన్ని దేవాలయాల్లో ఏర్పాట్లు చేశారు. వేయి స్తంభాల ఆలయంలో సీతారామచంద్రస్వామి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎదుర్కోళ్లు నిర్వహించారు. అర్చకులు ఉత్సవ విగ్రహాలకు కల్యాణ తిలకం దిద్ది, కల్యాణరాముడిగా అలంకరించి ఎదుర్కోళ్లు నిర్వహించారు. రామచంద్రస్వామి సీతాదేవి కల్యాణ మహోత్సవం బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ ఈఓ వెంకటయ్య, ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.1,116 చెల్లించి రశీదు పొందాలని సూచించారు.