పక్కాగా పంటల లెక్క | - | Sakshi
Sakshi News home page

పక్కాగా పంటల లెక్క

Sep 23 2026 12:37 AM | Updated on Sep 23 2026 12:37 AM

కొత్తకోట రూరల్‌: జిల్లాలో ఖరీఫ్‌ సాగు లెక్క తేల్చడానికి వ్యవసాయశాఖ అధికారులు డిజిటల్‌ క్రాప్‌ బుకింగ్‌ సర్వే చేపట్టారు. జిల్లా వ్యవసాయ అధికారితో పాటు ఏడీఏల పర్యవేక్షణలో జిల్లాలోని 265 గ్రామపంచాయతీలు, వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్‌, అమరచింత పురపాలికల్లో 72 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు, 266 మంది వలంటీర్లు నెలాఖరు వరకు సర్వే పూర్తి చేయనున్నారు. వారు క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు.. సర్వేనంబర్‌ వారీగా సాగు చేసిన పంట వివరాలు, ఫొటోలను క్రాప్‌ బుకింగ్‌ మొబైల్‌ యాప్‌లో జియో ట్యాగింగ్‌ ద్వారా నమోదు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సమస్యలు తలెత్తుతున్నట్లు వలంటీర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు చెబుతున్నారు. సర్వే ద్వారా జిల్లాలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే కచ్చితమైన వివరాలు రావడంతో పాటు పంటల దిగుబడిని అంచనా వేసి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రభుత్వానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. క్రాప్‌ బుకింగ్‌ సర్వే ద్వారా కొన్ని పంటలకు మద్దతు ధర లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.

జిల్లాలో కొనసాగుతున్న డిజిటల్‌ క్రాప్‌ బుకింగ్‌ సర్వే

పల్లెబాట పట్టిన వ్యవసాయ అధికారులు

నెలాఖరు వరకు గడువు

ప్రతి రైతు సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు

సర్వేలో 72 మంది వ్యవసాయ అధికారులు.. 266 మంది వలంటీర్లు

అధికారులు అవగాహన కల్పించినా..

ఎల్‌నినో ఖరీఫ్‌ సాగుపై ఎంతమేర ప్రభావం చూపిందనే లెక్క సర్వేతో తేలనుంది. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు రైతులు పంటల సాగుకు సిద్ధమయ్యారు. ఇప్పటికీ భారీ వర్షాలు లేక చెరువులు వెలవెలబోతుండగా, భూగర్భ జలాలు అడుగంటాయి. సాగు ప్రారంభంలోనే ప్రభుత్వం ఎల్‌నినో ప్రభావం ఉంటుందని.. ఆరుతడి పంటల సాగువైపు రైతులను మళ్లించే దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. అయి నా రైతులు మాత్రం ఎక్కువ శాతం వరి, తక్కువ భాగంలో పత్తి సాగును వీడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement