భూ రీ–సర్వే వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూ రీ–సర్వే వేగవంతం చేయాలి

Sep 23 2026 12:37 AM | Updated on Sep 23 2026 12:37 AM

వనపర్తి: జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ–సర్వే ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సర్వేయర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లాలోని సర్వేయర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న రీ–సర్వే పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్‌ దరఖాస్తులు, భూ సరిహద్దు వివాదాలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కచ్చితత్వంతో సర్వే నిర్వహించాలన్నారు. సర్వే ప్రక్రియలో రైతులు, భూ యజమానుల నుంచి వచ్చే వినతులు, అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సరిహద్దు వివాదాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించి వాస్తవాలను పరిశీలించిన అనంతరం స్పష్టమైన నివేదికలను అందించాలన్నారు. వివిధ సర్వే విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో రీ–సర్వే పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా సర్వే ఏడీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement