మహిళల స్వయం ఉపాధికి ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

మహిళల స్వయం ఉపాధికి ఉచిత శిక్షణ

Sep 23 2026 12:37 AM | Updated on Sep 23 2026 12:37 AM

వనపర్తి: మహిళల స్వయం ఉపాధికి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌సేటీ) ఆధ్వర్యంలో జపా మైడ్స్‌ (మదర్‌ అండ్‌ బేబీకేర్‌ టేకర్‌) కోర్సును ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని, నగర ప్రాంతాల్లో ఉపాధి పొందేందుకు ఆసక్తి, సంసిద్ధత కలిగిన మహిళలకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు 20 రోజుల పాటు ఉచితంగా తల్లి, నవజాత శిశువు సంరక్షణకు సంబంధించిన అంశాలు, శిశువుల రోజువారీ అవసరాల నిర్వహణ, పరిశుభ్రత, పోషకాహారం, భద్రత, తల్లి సంరక్షణలో పాటించాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. అదనంగా ఆస్పత్రుల్లో ప్రాక్టికల్‌ అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల మహిళలు మర్రికుంటలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎదురుగా ఉన్న వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ భవనంలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు98859 40945, 85220 88978, 79816 84174 సంప్రదించాలన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి

వనపర్తిటౌన్‌: గణేశ్‌ నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు సహకరించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎం.మాధవి, వైస్‌చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌ కోరారు. మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. మూడు రోజుల్లో 1,050కు పైగా గణనాథులు నిమజ్జనానికి తరలివెళ్లనున్నట్లు తెలిపారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో రెండు క్రేన్లు ఏర్పాటు చేశామని, అవసరమైన చోట పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. నల్లచెరువులో మట్టి గణపతుల నిమజ్జనం కోసం కృత్రిమ కొలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాగా, ఈ నెల 25న మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం నిర్వహించనున్నట్లు చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ తెలిపారు. సమావేశంలో ఎంఈలు ప్రశాంత్‌, మేఘనాథ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement