వనపర్తి: ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు నేరాల నియంత్రణ, నేరస్తుల కదలికలపై పటిష్ట నిఘా, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా అధికారులు, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ సంస్థలు, దాతల సహకారంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 412 సీసీ కెమెరాలు, మరమ్మతు చేయించిన పాత కెమెరాలను కలుపుకొని మొత్తం 2,221 సీసీ కెమెరాల యూనిట్‌ను శుక్రవారం సాయంత్రం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, ముఖ్యమైన ప్రదేశాల్లో నిత్యం నిఘా కొనసాగనుందని, కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయడంతో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలు, నేరాలకు సంబంధించిన ఘటనలను గుర్తించడం నిరంతర ప్రక్రియలో భాగమవుతుందన్నారు. స్మార్ట్ పోలీసింగ్.. సేఫ్ వనపర్తి లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా దాతలను ఎస్పీ శాలువాలతో సత్కరించారు. సమాజ హితం కోసం భవిష్యత్‌లోనూ ఇలాంటి సామాజిక భాగస్వామ్యం కొనసాగాలని పిలుపునిచ్చారు.
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి..
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణలో జరుపుకోవాలని ఎస్పీ సునీతారెడ్డి సూచించారు. శుక్రవారం నిర్వహించిన శాంతి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉత్సవాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉందని, ప్రతి ఒక్క గణపతి మండపం జ్ట్టి ఞట://ఞౌ జీఛ్ఛిఞౌట్ట్చ .్టటఞౌ జీఛ్ఛి.జౌఠి.జీ ుఽ లింకుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మండపాల్లో ఎట్టి పరిస్థితుల్లో డీజేలు ఏర్పాటు చేయరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, వనపర్తి, కొత్తకోట సీఐలు సుగంధ రత్నం, ఓడీ రమేష్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, జిల్లాలోని ఎస్సైలు, పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ మతాల పెద్దలు, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


