వనపర్తి: వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆర్డీఓ సుబ్రమణ్యం కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై శాంతికమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్వాహకులు మండపాల ఏర్పాటుకు సంబంధిత శాఖల నుంచి ముందస్తు అనుమతులు పొందాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్‌శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రజలు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరాకు నాణ్యమైన, ప్రమాణాలకు అనుగుణమైన తీగలను మాత్రమే వినియోగించాలని.. సంబంధిత శాఖ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో కూడా ముందుగానే విద్యుత్ సరఫరా, ఇతర అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల్లో డీజేలు నిబంధనలకు అనుగుణంగా మాత్రమే వినియోగించాలని.. అధిక శబ్ధంతో వృద్ధులు, చిన్నారులు, విద్యార్థులు, ఆస్పత్రుల్లోని రోగులకు ఇబ్బందులు కలగకుండా శబ్ధ పరిమితులు తప్పనిసరిగా పాటించాలన్నారు. అవసరమైన చోట తాగునీరు, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నిమజ్జనం రోజున మద్యం దుకాణాలు మూసి వేయించనున్నట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. నిర్వాహకులు, ప్రజలు అధికారులకు సహకరిస్తూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. సమావేశంలో పుర చైర్‌పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్, విద్యుత్, మున్సిపల్, పంచాయతీ, పారిశు ద్ధ్య తదితర శాఖల అధికారులు, మసీద్ కమిటీ సభ్యులు, శాంతికమిటీ సభ్యులు పాల్గొన్నారు.


