కోటిలింగేశ్వరస్వామి సన్నిధిలో న్యాయమూర్తులు | - | Sakshi
Sakshi News home page

కోటిలింగేశ్వరస్వామి సన్నిధిలో న్యాయమూర్తులు

Aug 24 2026 12:25 AM | Updated on Aug 24 2026 12:25 AM

కొత్తకోట రూరల్‌: మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న కోటిలింగేశ్వర దత్తక్షేత్రాన్ని ఆదివారం జిల్లా న్యాయమూర్తులు బాకరాజు శ్రీనివాసరావు, లావణ్య బాలరెడ్డి, కళార్చన, కవిత, కార్తీక్‌రెడ్డి, శ్రీలత, అశ్విని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న న్యాయమూర్తులకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. శ్రావణమాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వారిని అర్చకులు శేష వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. శ్రావణమాసంలో శ్రీ కోటిలింగేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement