జూరాలకు 31 వేల క్యూసెక్కుల వరద | - | Sakshi
Sakshi News home page

జూరాలకు 31 వేల క్యూసెక్కుల వరద

Aug 24 2026 12:25 AM | Updated on Aug 24 2026 12:25 AM

గద్వాల/ఆత్మకూర్‌ / అచ్చంపేట: ఎగువ ప్రాంతం నుంచి ఆదివారం జూరాలకు 31 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో హైడల్‌ విద్యుత్‌ కేంద్రానికి 23,531 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భీమా లిఫ్టు–1కు 1,300, లిఫ్టు–2 872, కోయిల్‌సాగర్‌కు 930, ప్రధాన ఎడమ కాల్వకు 820, కుడి కాల్వకు 550, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులు వదలగా.. నెట్టెంపాడు ప్రాజెక్టుకు నిలిపివేశారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి దిగువకు 54,865 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.30 మీటర్ల వద్ద 9.214 టీఎంసీల నీరు ఉంది.

153.052 మి.యూ. విద్యుదుత్పత్తి..

ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోందని ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. ఆదివారం ఎగువన 4 యూనిట్ల నుంచి 156 మెగావాట్లు, 86.912 మి.యూ., దిగువన 4 యూనిట్ల నుంచి 160 మెగావాట్లు, 66.140 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జల విద్యుత్‌ కేంద్రాల్లో 153.052 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి పూర్తి చేసినట్లు చెప్పారు. విద్యుదుత్పత్తికి 24 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువన శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని వివరించారు.

శ్రీశైలంలో స్పల్పంగా పెరిగిన నీటిమట్టం

శ్రీశైలం జలాశయంలోకి నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో స్వల్పంగా నీటిమట్టం పెరిగింది. జూరాల జల విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలానికి 23,531 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కుడిగట్టు కేంద్రంలో లోడ్‌ డిస్పాచ్‌ ఆదేశాల మేరకు గురువారం నుంచి విద్యుదుత్పత్తి తాత్కాలికంగా నిలిపివేశారు. విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు 7,063 క్యూసెక్కులు వదిలారు. అలాగే శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి రాయలసీమ తాగు, సాగునీటి పథకాల కోసం హంద్రీ–నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. అలాగే కేఎల్‌ఐ ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 876 అడుగుల వద్ద 168.2670 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement