వనపర్తి: దేశ అభివృద్ధిలో శాంతిభద్రతలు అత్యంత కీలకమని.. పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యత, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఆమె హాజరై 8.45 గంటలకు సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుంటూ వారి త్యాగాలు, స్ఫూర్తి మనందరికీ ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవించి సమస్యలను సానుకూలంగా విని న్యాయం అందించాలని కోరారు. ప్రతి బాధితుడికి న్యాయం అందించినప్పుడే స్వాతంత్య్రానికి నిజమైన సార్థకత లభిస్తుందని పేర్కొన్నారు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ సునంద, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు సుగంధ రత్నం, రాంబాబు, శివకుమార్, సీసీఎస్ సీఐ అశోక్‌కుమార్, రిజర్వ్ ఇనన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తున్న
ఎస్పీ సునీతారెడ్డి, పోలీసు అధికారులు


