గిరిజన విద్యార్థిని మృతి | - | Sakshi
Sakshi News home page

గిరిజన విద్యార్థిని మృతి

Nov 21 2026 12:50 AM | Updated on Nov 21 2026 12:50 AM

సాలూరు: మండలంలోని కురుకుట్టి పంచాయతీ దిగువకాసాయవలస గ్రామంలో 14 ఏళ్ల గిరిజన విద్యార్థిని ఆకస్మిక మరణం గ్రామంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాలు... దిగువకాసాయవలస గ్రామానికి చెందిన తాడంగి రాజారావు, అమ్మాజి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె లావణ్య(14) కురుకుట్టి ఆశ్రమ పాఠశాలలో తొమ్మి దో తరగతి చదువుతుంది. ఈ నెల 11న లావణ్య రజస్వల కావడంతో పాఠశాల సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రు ల అంగీకార పత్రం తీసుకున్న అనంతరం ఆమెను వారి స్వగ్రామానికి పంపించినట్టు పాఠశాల హెచ్‌ఎం జె.శివ తెలిపారు. వారి ఆచారం ప్రకారం తొమ్మిది రోజుల అనంతరం నిర్వహించాల్సిన మంగళస్నానానికి కుటుంబ సభ్యులు ఏ ర్పాట్లు చేసుకుంటున్న సమయంలో గురువారం లావణ్యకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధపడుతుండగా ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే లావణ్య ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement