ఉపాధ్యాయులకు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ శిక్షణ

Nov 16 2026 12:26 AM | Updated on Nov 16 2026 12:26 AM

ఉపాధ్యాయులకు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ శిక్షణ

విజయనగరం అర్బన్‌: భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఆధ్వర్యంలో పురుష ఉపాధ్యాయులకు బేసిక్‌, అడ్వాన్స్‌డ్‌ శిక్షణ కోర్సులను ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు స్థానిక పూల్‌బాగ్‌లోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమం జరగనుంది. పీఎంశ్రీ పాఠశాలల నుంచి ఇప్పటికే అడ్వాన్స్‌డ్‌ శిక్షణ పూర్తి చేసిన పురుష ఉపాధ్యాయులు కాకుండా ఇతర ఉపాధ్యాయులు ఈ శిక్షణకు హాజరు కావాలని సూచించారు. పీఎంశ్రీ పాఠశాలలు కాని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు కూడా సొంత రిజిస్ట్రేషన్‌ ఖర్చుల తో శిక్షణలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఏడు రోజుల శిక్షణకు యూనిఫాం, వసతి ఖర్చుల నిమిత్తుం రూ.4,000 చెల్లించాల్సి ఉంటుందని తెలిపా రు. ఇతర వివరాలకు భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా కార్యదర్శి వాక చిన్నంనాయుడు 9440912863 నంబరును సంప్రదించాలని సూచించారు.

కష్టాల పంటకు కన్నీటి వీడ్కోలు..!

పార్వతీపురం రూరల్‌: ఖరీఫ్‌ సీజన్‌ ముగిసి పంట చేతికి వచ్చినప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు చంద్రబాబు ప్రభుత్వ విధానాల కారణంగా తమకు అన్యాయం జరుగుతోందని రైతులు వాపోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 80 వేల హెక్టార్లు కాగా, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, తుఫాన్ల కారణంగా కేవలం 35 వేల హెక్టార్లలోనే వరి సాగైంది. మొత్తం 5.16 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రాగా, అందులో 3.81 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది.

కొనుగోలు కేంద్రాలు లేక దళారుల దోపిడీ..

పౌర సరఫరాల సంస్థ 21 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు లక్ష్యంతో జిల్లాలో 281 ఆర్‌ఎస్‌కేల పరిధిలో 181 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అయితే, ఈ–బీజీల సమర్పణ విషయంలో మిల్లర్లు ముందుకు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. ప్రభుత్వం సాధారణ రకం క్వింటాకు రూ. 2,441, ఎ–గ్రేడ్‌ రకానికి రూ. 2,461 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయిస్తున్నారు. 80 కిలోల బస్తాను దళారులు రూ.1,550కే కొనుగోలు చేస్తుండడంతో రైతులు బస్తాకు సుమారు రూ.500 వరకు నష్టపోతున్నారు. దీనికి తోడు తూకంలో బస్తాకు రెండున్నర నుంచి నాలుగు కిలోల వరకు అదనంగా కోత విధిస్తున్నారని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

కళ్లాల్లోకి

చేరుతున్న ధాన్యం..

కొనుగోలు

కేంద్రాల్లో జాప్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement