పంచాయతీ నామినేషన్లకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ నామినేషన్లకు శ్రీకారం

Nov 16 2026 12:26 AM | Updated on Nov 16 2026 12:26 AM

పంచాయతీ నామినేషన్లకు శ్రీకారం ● తొలి విడత పంచాయతీ పోరులో 8 మండలాల్లో ఎన్నికలు ● సర్పంచ్‌ స్థానాలకు 118, వార్డు స్థానాలకు 243 నామినేషన్లు

● తొలి విడత పంచాయతీ పోరులో 8 మండలాల్లో ఎన్నికలు ● సర్పంచ్‌ స్థానాలకు 118, వార్డు స్థానాలకు 243 నామినేషన్లు

విజయనగరం రూరల్‌: పల్లె పోరుకు తొలి ఘట్టం ప్రారంభమైంది. జిల్లాలో ని 773 గ్రామ పంచాయతీలకు, 7292 వార్డులకు మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ చేపట్టనుండగా తొలిదశ పంచాయతీ ఎన్నికలు 8 మండలాల్లో నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఆదివారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని బొబ్బిలి డివిజన్‌లో బొబ్బిలి, రామభద్రాపురం, తెర్లాం, బాడంగి మండలాల్లో 110 గ్రామ పంచాయతీలకు 1054 వార్డులకు ఎన్నికలు నిర్వహించనుండగా, విజయనగరం డివిజన్‌ పరిధిలో కొత్తవలస, ఎల్‌.కోట, వేపాడ, శృంగవరపుకోట మండలాల్లో 111 గ్రామ పంచాయతీలు 1054 వార్డులకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి రోజు 221 గ్రామ పంచాయతీలకు 118 నామినేషన్లు దాఖలు కాగా, 2108 వార్డులకు 243 నామినేషన్లు దాఖలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement