రాజాం : రాజాం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాలవలస పద్మావతి తన నామినేషన్ పత్రాలు ఆదివారం దాఖలు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను అందజేశా రు. మరోవైపు పద్మావతి భర్త, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు పాలవలస శ్రీనివాసరావు 9వ వార్డులో కౌన్సిలర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ తలే రాజేష్, మాజీ ఎమ్మెల్యే తలే భద్ర య్య, డాక్టర్ మాధవీలత, డాక్టర్ నరేంద్ర పాల్గొన్నా రు. నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ఆదివారం 46 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌సీపీ తరఫున 35, టీడీపీ తరఫున ఆరు, స్వతంత్ర అభ్యర్థులుగా ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో నామినేషన్ల సంఖ్య 48కి చేరగా, చైర్మన్ పదవికి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.


