వైఎస్సార్‌సీపీలో 60 కుటుంబాల చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో 60 కుటుంబాల చేరిక

Nov 16 2026 12:20 AM | Updated on Nov 16 2026 12:20 AM

బొండపల్లి: మండలంలోని నెలివాడ గ్రామంలో టీడీపీ మండల సీనియర్‌ నాయకుడు, గ్రామానికి చెందిన టీడీపీ ప్రధాన నాయకుడు కునుకు నారాయణప్పడుతో పాటు ఆయన అనుచరులు 60 కుటుంబాల వారు సుమారు 250 మంది టీడీపీని వీడి, వైఎస్సార్‌సీపీలో ఆదివారం చేరారు. పార్టీలో చేరిన వారందరికీ వైఎస్సార్‌సీపీ మండల ఉపాధ్యక్షుడు తాళ్లపూడి అప్పలనాయుడు, పార్టీ జిల్లా అర్గనైజేషనల్‌ ప్రధాన కార్యదర్శి గోట్టిముక్కల శివరామచంద్ర వర్మలు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అంటేనే వెన్ను పోటు పార్టీ అని ఎన్నికల ముందు వరకు నాయకులను వాడుకుని వదిలేయడం ఆ పార్టీ నాయకులకు అలవాటేనన్నారు. మండలంలో టీడీపీ సీనియర్‌ నాయకుడిగా ఉన్న నారాయణప్పడును కాదని సర్పంచ్‌ ఎన్నికల్లో వేరే వ్యక్తిని ఆపార్టీ నాయకులు ముందుకు తెచ్చారని, పార్టీ జెండాలు మోసే వారికి ఆపార్టీలో గుర్తింపు లేదన్నారు. అందుకే పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరడం శుభ పరిణామమని పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యం ఎప్పడూ ఉంటుందని తెలిపారు. వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో నారాయణప్పడు(చిన్నయ్య)తో పాటు కునుకు రమేష్‌, కునుకు పెద్ద చిన్నయ్య, కునుకు పాపినాయుడు, రెడ్డి తాతారావు, కురిమినేని సునీల్‌, బూర విజయ్‌ కుమార్‌, కోట రాము, వర్రి రామకృష్ణ, మామిడి లక్ష్ముం, లెంకవలస అప్పన్న తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పురమనేని రాము, కునుకు అప్పారావు, కొమ్మా నరేష్‌ కుమార్‌, కునుకు మారునాయుడు తదితరులు పాల్గొన్నారు.

రాజాంలో చేరికలు

రాజాం: పట్టణంలోని వంజరాంపేట వార్డుకు చెందిన పలువురు టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఆదివారం చేరారు. రాజాంలోని పార్టీ కార్యాలయంలో ఈ చేరికలు జరిగాయి. వంజరాంపేట గ్రామానికి చెందిన మజ్జి గాంధీ సమక్షంలో గాంధీయూత్‌కు చెందిన వందమంది యువత పలుపార్టీల నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరి కండువాలు కప్పుకున్నారు. పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ తలే రాజేష్‌ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో రాజాంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించడమే తమ లక్ష్యమని పార్టీలో చేరినవారంతా పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ రాజాం పట్టణ కన్వీనర్‌ పాలవలస శ్రీనివాసరావు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి పాలవలస పద్మావతి, కెంబూరి నారాయణరావు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement