రాజాం: రాజాం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా జనసేన పార్టీ తరఫున నిలుస్తున్న బేరు సౌజన్యలత పేరుకే జనసేనపార్టీ. ఈ ఎన్నికల్లో జనసేనకు టిక్కెట్ కేటాయింపు ఇక్కడ రావడంతో గత మూడురోజుల్లోనే ఆమె తన కుటుంబసభ్యులతో పాటు పవన్‌కల్యాణ్‌ను కలిసి టికెట్ తెచ్చుకుంది. ఈ టిక్కెట్ కేటాయించడం వెనుక బలమైన ఆర్థిక, రాజకీయ సమీకరణాలు ఉన్నాయని, భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరిగాయనే హాట్ టాపిక్ నడుస్తోంది. ఆమె తండ్రి బనిశెట్టి వెంకటరావు రాజాంలో టీడీపీ కార్యకర్తగా ఉన్నారు. రాజాం వీవర్స్ సొసైటీలో ఇటీవల జరిగిన స్కాంలో ఆయన ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల్లో భాగంగానే ఈ కుటుంబానికి చెందిన సౌజన్యకు టిక్కెట్ కేటాయించడం ఒక ఎత్తు కాగా, చేనేత ఓటర్లను ఆకర్షించడంలో భాగంగానే ఈ సీటు కేటాయించారనే వాదన మరో ఎత్తుగా రాజాంలో చక్కర్లు కొడుతోంది. రాజాం మున్సిపాల్టీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా అన్ని వర్గాల్లో విమర్శలకు తావిస్తోంది. మున్సిపాల్టీలో 40శాతం దాటి ఓట్లు ఉన్న కాపు కులాన్ని కాదని వేరే వారికి సీటు కేటాయించారు. ఇంకో వైపు జనసేన పార్టీ రాజాం ఇన్చార్జ్గా గత ఏడేళ్లుగా సేవలు అందిస్తున్న కాపు కులానికి చెందిన పొగిరి సురేష్‌కుమార్‌కు మొండిచెయ్యి చూపించారు. రాజాంలో స్థానికంగా లేనివారికి చైర్మన్ సీటు కేటాయించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అసంతృప్తిలో జనసేన కేడర్
జనసేన ఇన్చార్జ్ పొగిరి
సురేష్‌కుమార్‌కు మొండిచెయ్యి
రాజాం మున్సిపల్ చైర్పర్సన్ టికెట్ సౌజన్యలతకు కేటాయింపు


