అనారోగ్యంతో ఏఆర్‌ ఎస్సై మృతి | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో ఏఆర్‌ ఎస్సై మృతి

Nov 16 2026 12:20 AM | Updated on Nov 16 2026 12:20 AM

వంగర: మండల పరిధి రుషింగి గ్రామానికి ఏపీఎస్పీ ఏఆర్‌ ఎస్సై గుడివాడ శ్రీనివాసరావు(53) ఆదివారం అనారోగ్యంతో మృతిచెందారు. విశాఖపట్నం ఏపీఎస్పీ 16బెటాలియన్‌లో ఏఆర్‌ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆయన అనారోగ్య సమస్యల కారణంగా విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన స్వగ్రామం రుషింగికి భౌతికకాయాన్ని తరలించారు. ఇక్కడ నిర్వహించిన అంత్యక్రియల్లో గ్రామస్తులు, కుటుంబ సభ్యులతోపాటు విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్లు సాయి గణేష్‌, నారాయణరావులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు భౌతికకాయం వద్ద నివాళి అర్పించారు. పోలీసు సంక్షేమ నిధి నుంచి రూ.2లక్షలు మృతుడి భార్య దమయంతికి అందించారు. మృతునికి భార్యతో పాటు కుమారుడు గౌతమ్‌, కుమార్తె యామిని ఉన్నారు.

కొబ్బరి చెట్టు పైనుంచి జారిపడి కార్మికుడి మృతి

పెదవేగి: మండలంలోని రామసింగవరంలో విషాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం గొప్పవానిపేటకు చెందిన గుంపా లక్ష్మణరావు (49) కొబ్బరికాయలు దించేందుకు ఆదివారం ఉదయం రామసింగవరం వచ్చారు. స్థానికంగా కడప బాలబాలాజీకి చెందిన తోటలో కొబ్బరికాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉపాధి కోసం తమతో పాటు వచ్చిన సహచరుడు విగతజీవిగా మారడంతో తోటి కార్మికులు కన్నీరుమున్నీరయ్యారు.

రాగోలులో దొంగల హల్‌చల్‌

శ్రీకాకుళం రూరల్‌: రాగోలు జంక్షన్‌లో దొంగలు హల్‌చల్‌ సృష్టించారు. టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న ఓ రేకుల షెడ్‌లోకి శనివారం అర్ధరాత్రి ముగ్గురు దొంగలు చొరబడేందుకు ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు గమనించి కేకలు వేయడంతో ఇద్దరు పరారవ్వగా, ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. నిందితుడిని ఆదివారం రూరల్‌ పోలీస్టేషన్‌కు అప్పగించారు. పట్టుబడిన వ్యక్తి పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన బెవర శిమ్మయ్యగా పోలీసులు గుర్తించారు. పోలీసులు విచారించగా శ్రీకాకుళంలోని దుస్తులు కొనడానికి వచ్చామని చెప్పినట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

సజావుగా పంచాయతీ

ఎన్నికల ప్రక్రియ : ఎస్పీ

విజయనగరం టౌన్‌: జిల్లాలో రాజాం మున్సిపాలిటీ, మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఎనిమిది మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ సజావుగా పూర్తి కావాలని, అందుకు సంబంధించిన అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఎస్పీ ఎఆర్‌.దామోదర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నామిషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు సంబంధిత పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజాం పురపాలక ఎన్నికలకు, మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బాడంగి, బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, కొత్తవలస, లక్కవరపు కోట, శృంగవరపుకోట, వేపాడ మొత్తం ఎనిమిది మండలాల్లో నామినేషన్లు స్వీకరించే కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను చేపట్టాలన్నారు. నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలన్నారు. డ్రోన్‌ కెమెరాల ద్వారా నామినేషన్‌ కేంద్రాలు, పరిసర ప్రాంతాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రజలు సహకరించాలని, బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement