గుండె రోగులకు అందని సేవలు | - | Sakshi
Sakshi News home page

గుండె రోగులకు అందని సేవలు

Nov 16 2026 12:20 AM | Updated on Nov 16 2026 12:20 AM

సర్వజన ఆస్పత్రిలో

● కేజీహెచ్‌, ప్రైవేటు ఆస్పత్రులను

ఆశ్రయించాల్సిన దుస్థితి

విజయనగరం ఫోర్ట్‌: జిల్లా ఏకై క బోధనాస్పత్రి అయిన ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చిన అనేక మంది రోగులు కార్డియాలజీ సేవలు అందుబాటులో లేక పోవడం వల్ల కేజీహెచ్‌ను, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. సర్వజన ఆస్పత్రులో రోగులకు సేవలు అందక పోవడం వల్ల వ్యయ, ప్రయాసలతో చేతిచమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి. జిల్లా నలుమూలలనుంచి రోగులు అధిక సంఖ్యలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వస్తారు. ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలతో రోగులు వస్తున్నారు. సర్వజన ఆస్పత్రిలో గుండెసంబంధిత వైద్యులు లేక పోవడం వల్ల వారిని కేజీహెచ్‌కు రిఫర్‌ చేస్తున్నారు. వారిలో కొంతమంది కేజీహెచ్‌కు వెళ్లలేక స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ వేలల్లో చేతిడబ్బులు పెట్టి వైద్యం చేయించుకుంటున్నారు.

గత ప్రభుత్వంలో వైద్యకళాశాల మంజూరు

గత జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన ప్రభుత్వ వైద్య కళాశాలను జిల్లాకు మంజూరు చేసి రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేసి కళాశాలను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా జిల్లా ఆస్పత్రిని బోధనాస్పత్రిగా మార్చి అందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించింది. సర్వజన ఆస్పత్రిలో అనేక రకాల వసతులు కల్పించడంతో పాటు స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ టీడీపీ సర్కార్‌ అధికారంలో వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా సర్వజన ఆస్పత్రికిగాని, ప్రభుత్వ వైద్య కళాశాలకు గాని ఎటువంటి వసతులు కల్పించలేదు. ముఖ్యంగా కార్డియాలజీ సేవలు లేక పోవడం వల్ల అధికశాతం మందిని రిఫర్‌ చేస్తున్నారు. కార్డియాలజిస్టును నియమించాలని ఆస్పత్రి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇంతవరకు నియమించిన దాఖలాలు లేవు.

ప్రతిపాదనలు పంపాం

గుండెసంబంధిత వ్యాధులకు సంబంధించి ఎక్కువగా రిఫరల్స్‌ వస్తున్నాయి. కార్డియాలజిస్ట్‌ను నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇంకా నియమించలేదు.

– డాక్టర్‌ అల్లు పద్మజ, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement