అలరించిన పల్స్‌ర్‌బైక్‌ రమణ | - | Sakshi
Sakshi News home page

అలరించిన పల్స్‌ర్‌బైక్‌ రమణ

Oct 22 2026 6:56 AM | Updated on Oct 22 2026 6:56 AM

రేగిడి: రేగిడి గ్రామంలో దేవీ శరన్నరవరాత్రుల్లో భాగంగా సోమవారం నిర్వహించిన పడిపూజలో పల్సర్‌బైక్‌ రమణ పాల్గొన్నారు. భజన గీతాలు ఆలపించి భక్తులను అలరించారు.

6 నామినేషన్ల తిరస్కరణ

● విజయనగరం కార్పొరేషన్‌ మేయర్‌ స్థానానికి ఒకటి.. వార్డు సభ్యులకు మూడు

● బొబ్బిలిలో రెండింటికి నో... నెల్లిమర్లలో అన్నీ సక్రమం

విజయనగరం అర్బన్‌: జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల సంఘం ప్రక టించిన షెడ్యూల్‌ ప్రకారం సోమవారం ఉద యం 11 గంటలకు అభ్యర్థుల సమక్షంలో స్క్రూటినీ ప్రారంభించారు. భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో సాయంత్రం వరకు పరిశీలన కొనసాగింది. విజయనగరం నగరపాలక సంస్థలో 17 కౌంటర్లను ఏర్పాటు చేశారు. పరిశీలన అనంతరం విజయనగరం కార్పొరేషన్‌లో మేయర్‌ పదవికి దాఖలైన ఒక నామినేషన్‌, వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన మూడు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. బొబ్బిలి మున్సిపాలిటీలో వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన మరో రెండు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నెల్లిమర్లలో చైర్‌పర్సన్‌, వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన అన్ని నామినేషన్లను అధికారు లు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించారు. విజయనగరం మున్సిపల్‌ కమిషనర్‌ బాలస్వామి, బొబ్బిలి కమిషనర్‌ రామలక్ష్మి, నెల్లిమర్ల కమిషనర్‌ గోవిందరావు పరిశీలన ప్రక్రియను పర్యవేక్షించారు.

21 వరకు ఉపసంహరణకు గడువు

నామినేషన్ల పరిశీలన ముగియడంతో తదుపరి దశపై అభ్యర్థుల దృష్టి పడింది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడు వు ఉంది. అదేరోజు పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. ఉపసంహరణ అనంతరం ఏయే వార్డుల్లో ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారనే దానిపై స్పష్టత రానుంది.

1500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయు డు ప్రాజెక్టుకు సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 1500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో సోమవారం 64.45 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టులో చేరుతున్న నీటిని ఒక గేటు ఎత్తి దిగువకు విడిచిపెడుతున్నామని ఏఈ నితిన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement