ప్రపంచ సాహితీ సభకు
విజయనగరం క్రైమ్:
రాజమహేంద్రవరంలో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో అక్టోబరు 1వ తేదీన నిర్వహిస్తున్న ప్రపంచ సాహితీ సభకు తరలిరావాలని శ్రీశ్రీ కళావేదిక జిల్లా కన్వీనర్ సముద్రాల గురుప్రసాద్ కోరారు. జిల్లా కేంద్రంలోని గురజాడ స్వగృహంలో ఆ సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. సాహిత్య గొప్పతనం చాటు తూ భావితరాలకు దానిని అందించే నేపథ్యంలో జరుగుతున్న ఈ సభకు సాహితీవేత్త లు, వర్థమాన కవులు, రచయితలంతా హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జాతీయ నాయకుడు డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, శ్రీశ్రీ కళావేదిక జిల్లా ఉపాధ్యక్షుడు పి.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


