స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్తున్న వైస్సార్‌సీపీ అభ్యర్థులపై
విజయనగరం ప్రజలు అభిమానం చూపుతున్నారు. హారతిచ్చి అక్కున చేర్చుకుంటున్నారు. నుదుట విజయతిలకం దిద్ది విజయీభవ అంటూ ఆశీర్వదిస్తున్నారు. విజేతగా నిలిచి సంక్షేమపాలన అందించాలని కోరుతున్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36, 29, 7వ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థులు పిల్లా జగత్‌బాబు, యవర్ణ విజయలక్ష్మి, ఇసరపు రేవతీదేవిలతో కలిసి మేయర్ అభ్యర్థి కోలగట్ల శ్రావణి సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని అభ్యర్థ్ధించారు. – విజయనగరం
7వ డివిజన్ కొత్తపేటలో పూలుజల్లి
శ్రావణికి
విజయ
తిలకం
దిద్దుతున్న మహిళ


