విజయనగరం గంటస్తంభం: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి జరిగే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, వినతులను సంబంధిత అధికారులకు నేరుగా అందజేయవచ్చన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమస్యలపై పీజీఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
క్యూఆర్ కోడ్‌తో ఫీడ్‌బ్యాక్
పీజీఆర్‌ఎస్ ద్వారా అందుతున్న సేవలు, సమస్యల పరిష్కారంపై ప్రజలు తమ అభిప్రాయాలను కూడా తెలి యజేసేందుకు క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పీజీఆర్‌ఎస్ ఫీడ్ బ్యాక్ పేజీలో వివరాలు నమోదు చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చన్నారు. ప్రజల అభిప్రాయాల ఆధారంగా పీజీఆర్‌ఎస్ సేవలను మరింత మెరుగు పరిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావడంతో పాటు క్యూఆర్ కోడ్ సదుపాయా న్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
విజయనగరం గంటస్తంభం: జీఓ నంబర్ 255 ను రద్దు చేసి సహకార రంగాన్ని పరిరక్షించాల ని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. విజయనగరంలోని ఎల్‌బీజీ భవన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని సుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. భీమసింగి సహా చక్కెర కర్మాగారాల్లో రైతులు, కార్మికులు, ఉద్యోగులకు బకాయిలు చెల్లించా లని డిమాండ్ చేశారు. భీమసింగి ఫ్యాక్టరీలో రూ.40.23 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలి పారు. జిల్లాలో తుఫాన్ కారణంగా పంటలకు సుమారు రూ.10 కోట్ల నష్టం జరిగిందని, సమ గ్రంగా అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరారు.కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డి శంకరరావు పాల్గొన్నారు.
విజయనగరం ఫోర్ట్: ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని పురష్కరించుకొని సోమవారం స్థానిక బహుళార్ధ పశు వైద్యశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పశు సంవర్ధక శా ఖ జేడీ డాక్టర్ ఎస్.మన్మధరావు తెలిపారు. పెంపుడు జంతువులకు ఉచితంగా రేబిస్ టీకాలు వేయడంతో పాటు వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. రేబిస్ ప్రాణంతకమైన వ్యాధి అయినప్పటకీ పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా దీనిని నివారించవచ్చని పేర్కొన్నారు.
పూసపాటిరేగ : భోగాపురం మండల కేంద్రంలోని ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌ను ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ వై.శ్రీనువాసు చౌదరి, జిల్లా ఎకై ్సజ్ ప్రోహిబిషన్ అధికారి శ్రీనాధుడు కలిసి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోగాపురం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో వైన్‌షాపుల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు. ఐదు షాపులకు ఎంత మంది టెండరు దాఖలు చేసింది.. తదితర విషయాలపై సీఐని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. భోగాపురం ఎకై ్సజ్ సీఐ ఎం.రవికుమార్, ఎస్‌ఐలు చంద్రమోహన్, సురేష్ తదితరులు ఉన్నారు.
పాలకొండ రూరల్: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ వారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 11 నుంచి 20 వరకు అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలను నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవదాయ శాఖ ఈఓ వీవీ సూర్యనారాయణ ఆదివారం తెలిపారు. ఈ క్రమంలో సోమవారం నుంచి అమ్మవారి మూలవిరాట్ తెరచాటుకు వెళ్లనున్నట్లు ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ పేర్కొన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 10న ఉదయం 8 గంటలకు అమ్మవారి నిజరూప దర్శనంతో నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నట్లు వివరించారు.


