ముగిసిన చెకుముకి సైన్స్‌ సంబరాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన చెకుముకి సైన్స్‌ సంబరాలు

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

ముగిసిన చెకుముకి సైన్స్‌ సంబరాలు

విజయనగరం అర్బన్‌: విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చడమే లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలు ఉత్సాహభరితంగా జరిగా యి. స్థానిక సత్య డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో నిర్వహించిన సంబరాల్లో జిల్లా వాప్తంగా వివిధ పట్టణాలు, మండలాల నుంచి 39 జట్ల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైన్స్‌ ఉపాధ్యాయు లు, విశాఖపట్నం సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ జోగా చంద్రశేఖర్‌, ఉపాధ్యాయులు బి.వెంకటరావు, శ్రీనివాసరావు 8, 9, 10వ తరగతి విద్యార్థులకు శాసీ్త్రయ ఆలోచనా విధానాన్ని వివరించారు. ‘ప్రశ్న అనేది శాస్త్ర విజ్ఞానానికి ప్రాణం’ అనే సందేశాన్ని విద్యార్థులకు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో విజయనగరం మండలం ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థుల జట్టు, ప్రైవేటు పాఠశాలల విభాగంలో విజయనగరంలోని ది నేషనల్‌ స్కూల్‌ విద్యార్థుల జట్టు జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచాయి. ఈ రెండు జట్లు నవంబర్‌లో భీమవరంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించను న్నాయి. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు వి.రాజగోపాల్‌, రాష్ట్ర సమతా కన్వీనర్‌ నిర్మల, జిల్లా అధ్యక్షుడు ఎంవీఎన్‌ వెంకటరావు, ప్రధాన కార్యదర్శి వి.రమణ ప్రభాత్‌, ఉపాధ్యక్షుడు వి.సత్యంనాయుడు అధ్వర్యంలో జిల్లా, నగర కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement