‘కన్నీటి సంద్రం – కళింగాంధ్ర’ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘కన్నీటి సంద్రం – కళింగాంధ్ర’ ఆవిష్కరణ

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

‘కన్నీటి సంద్రం – కళింగాంధ్ర’ ఆవిష్కరణ ● కళింగ ప్రజల ఆవేదనకు అక్షర రూపం ● ప్రముఖ సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణరెడ్డి

● కళింగ ప్రజల ఆవేదనకు అక్షర రూపం ● ప్రముఖ సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణరెడ్డి

రాజాం సిటీ: కళింగ ప్రజల ఆవేదనకు అక్షర రూప మే ‘కన్నీటి సంద్రం–కళింగాంధ్ర’ కవితా సంపుటని ప్రముఖ కవి, సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణరె డ్డి అన్నారు. ఇందులో కవి గార రంగనాథం ప్రజల కష్టాలు, కన్నీళ్లు, వలసల నేపథ్యాన్ని కళ్లకు కట్టిన ట్లు కవిత్వీకరించారని తెలిపారు. ఆదివారం ఓ జూనియర్‌ కళాశాలలో రాజాం రచయితల వేదిక 140వ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘కన్నీటి సంద్రం–కళింగాంధ్ర’ కవితా సంపుటిని ఆవిష్కరించిన అనంతర ప్రసంగించారు. కళింగాంధ్ర పేరుతో వచ్చిన తొలి కవితా సంపుటి ఈ గ్రంథమని, కళింగ ప్రజల ఆవేదనకు అక్షర రూపమని అన్నారు. ఇక్కడి కవులు, రచయితలు, కళాకారు లు, కళింగాంధ్ర అస్తిత్వాన్ని నిర్మించవలసిన అవస రం ఎంతైనా ఉందని, అప్పుడే ఈ నేల అభివృద్ధికి నోచుకుంటుందని తెలంగాణ ఉద్యమ కవిగా కోరా రు. తెలంగాణకు, కళింగాంధ్రకు పేదరికంలోనూ, అణచివేతలోను చాలా సామ్యాలు ఉన్నాయని అన్నా రు. కళింగాంధ్ర ప్రకృతి వనరులు అధికంగా ఉన్న నేలని ప్రశంసించారు. పిల్లా తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ డీవీజీ శంకరరా వు, వేదిక సభ్యులు గార రంగనాథం, వెలుగు రామినాయుడు, గట్టి పాపారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement