ఫార్మసిస్టుల పాత్ర అత్యంత కీలకం | - | Sakshi
Sakshi News home page

ఫార్మసిస్టుల పాత్ర అత్యంత కీలకం

Sep 26 2026 1:38 AM | Updated on Sep 26 2026 1:38 AM

● సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పద్మజ

విజయనగరం ఫోర్ట్‌: రోగులకు నాణ్యమైన ఔషధ సేవలను అందించడంలో ఫార్మసిస్టుల పాత్ర అత్యంత కీలకమని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అల్లు పద్మజ అన్నారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం సందర్బంగా కేక్‌ కట్‌ చేసి వేడుకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య సేవల వ్యవస్థలో ఫార్మసిస్టుల ముఖ్యమైన భాగస్వాములన్నారు. వారి అంకితభావం, సేవాతత్పరత, క్రమశిక్షణ అభినందనీయని తెలిపారు. కార్యక్రమంలో ఫార్మసీ ఆఫీసర్‌ బి.నరసింగ్‌రావు, కళ్యాణ్‌ ,శ్రీను, కోటమ్మ, ప్రతీ, కల్పన, ఫృద్వీ తదితరులు పాల్గొన్నారు.

పోలమాంబ అమ్మవారికి వెండి కిరీటం

మక్కువ: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారికి శుక్రవారం శంబర గ్రామానికి చెందిన అర్నిపల్లి పోలిరాజు దంపతులు కిలో వెండి కిరీటాన్ని బహుకరించారు. పోలిరాజు కుమారుడు ఇటీవల గ్రూప్స్‌లో ఉద్యోగం సాధించాడు. ఈ శుభ సందర్భంగా అమ్మవారికి కానుకగా కిలో వెండి కిరీటాన్ని తయారు చేయించి చదురుగుడిలో కొలువైన పోలమాంబ అమ్మవారికి మొక్కుగా చెల్లించుకున్నారు. అమ్మవారికి వెండి కిరీటాన్ని అలంకరించి అమ్మవారికి పోలిరాజు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెండి కిరీటాన్ని ట్రస్ట్‌ బోర్డ్‌ చైర్మన్‌ నైదాన తిరుపతిరావుకు అందజేశారు.

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

గుర్ల: మండలంలోని పాలవలసలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ ఇల్లు కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. పాలవలసకు చెందిన బక్కురు రాము ఇంట్లో శుక్రవారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్‌ వైర్లు తడిచిపోవడంతో షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సుమారు రూ.లక్ష వరకు ఆస్తి నష్టం సంభవించినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఎలక్ట్రికల్‌ వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. బాధిత కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు పరామర్శించారు.

డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో

రూ.20 వేలు జరిమానా

వీరఘట్టం: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఐదుగురు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేసి పాలకొండ కోర్టులో శుక్రవారం ప్రవేశపెట్టినట్లు ఎస్‌ఐ షణ్ముఖరావు తెలిపారు. ఈ కేసును విచారించిన పాలకొండ కోర్టు ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ సి.హెచ్‌.హరిప్రియ వీరిలో నలుగురుకు రూ.2500 చొప్పున మొత్తం రూ.10 వేలు, మరో వ్యక్తికి రూ.10 వేలు మొత్తం వీరందరికీ రూ.20 వేలు జరిమానాను విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement