రామభద్రపురం: జిల్లాలో అతిపెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన రామభద్రపురం అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్ అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారింది. చిన్నపాటి చినుకులకే బురదమయంగా మారింది. ఆసీలు రూపంలో ఏటా రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతున్నా కూడా పంచాయతీ అధికారులు మార్కెట్ నిర్వహణను పట్టించుకోలేదు. మార్కెట్‌లో ఎక్కడ చూసినా చెత్తా చెదారం, కుళ్లిన కూరగాయల వ్యర్ధాలే దర్శనమిస్తున్నాయి. దీనిపై ‘ఆదాయం ఘనం,.సౌకర్యాలు శూన్యం’ అన్న శీర్షికన ఈ నెల 24వ తేదీన సాక్షి కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన మేజర్ పంచాయతీ ఈఓ శ్రీనావాసరావు శుక్రవారం కూరగాయల మార్కెట్‌లో పరిశుభ్రత పనులు చేపట్టారు. జేసీబీతో మార్కెట్ ఆవరణలోని చెత్తను ట్రాక్టర్‌ల ద్వారా చెత్తశుద్ధి కేంద్రానికి తలరించారు. స్వీపర్లతో మార్కెట్‌లోని చెత్తను పూర్తిగా తొలగించారు. రైతులు ఆనందం వ్యక్తం చేశారు.


