విస్తరణకు మార్గం సుగమం | - | Sakshi
Sakshi News home page

విస్తరణకు మార్గం సుగమం

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

రోడ్డు విస్తరణకు అడ్డంకులు తొలగాయి

గతంలో తారాపురం వద్ద అర్ధాంతరంగా నిలిచిన రోడ్డు విస్తరణ పనులకు అడ్డంకులు తొలగాయి.బాధితులతో పలుమార్లు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. జాతీయ రోడ్డు పక్కన ఉండి ఇళ్లు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం రూ.5.54 కోట్లు పరిహారం విడుదల చేసింది.బాధితుల ఖాతాలకు జమచేసేందుకు వారి వివరాలు సేకరించాం.త్వరలో బాధితుల ఖాతాలకు పరిహారం జమకానుంది.

– అజూ రఫీజాన్‌, తహసీల్దార్‌, రామభద్రపురం

భారీ వాహనాల రాకపోకలు

ఈ జాతీయ రహదారి మీదుగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఉన్న పరిశ్రమలకు సంబంధించిన లోడులతో పెద్దపెద్ద భారీ వాహనాలు ఈ జాతీయ రహదారి మీదుగానే రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో గడిచిన కొన్నేళ్లుగా రోడ్డు విస్తరణ పనులు అర్ధాంతరంగా ఆగిన తారాపురం వద్ద రోడ్డు అస్తవ్యస్తంగా తయారవడంతో పలు ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో మనుషులు, పశువులు, జంతువులు మృత్యువాత పడిన సంఘటనలు జరిగాయి. అలాగే ఎంతో మంది క్షతగ్రాత్రులుగా మారారు. ఇప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జాతీయ రహదారి కావడం, రోడ్డు వెడల్పు తక్కువ ఉండటంతో పాటు అస్తవ్యస్తంగా ఉండడం, అధిక సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించడం వల్ల అత్యవసరాలకోసం సమీపంలోని పట్టణ కేంద్రాలకు చేరాలంటే ప్రజలకు, వాహనచోదకులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. కొన్నేళ్ల తర్వాత తారాపురం వద్ద విస్తరణ పనులకు అడ్డంకులు తొలగాయని ఇప్పటికై నా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని పలువురు ప్రజలు, వాహనచోదకులు కోరుతున్నారు.

రామభద్రపురం:

రేళ్ల క్రితం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ, రాష్ట్ర రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించి జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణాలతో పాటు విస్తరించి ప్రజలు, వాహనచోదకుల రవాణా కష్టాలు తొలగించింది. జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా రామభద్రపురం మండలం కొట్టక్కి నుంచి గజపతినగరం వరకు కేంద్ర ప్రభుత్వం ఏన్యువల్‌ ప్లాన్‌ కింద రూ.221.40 కోట్ల నిధులతో 26వ నంబరు జాతీయ రహదారి సుమారు 35 కిలో మీటర్ల మేర టూ లేన్‌ విత్‌ పావ్‌డ్‌ షోల్డర్స్‌ రోడ్డు నిర్మాణం చేపట్టింది. రోడ్డు నిర్మాణంతో పాటు కొట్టక్కి నుంచి గజపతినగరం వరకు మధ్యలో ఉన్న 70 నుంచి 80 కల్వర్టులు,3 మైనర్‌ బ్రిడ్జిలు, గజపతినగరం వద్ద మేజర్‌ బ్రిడ్జి అధునికీకరించారు. దాదాపు గజపతినగరం కోర్టు దగ్గర నుంచి కొట్టక్కి మీదుగా సాలూరు వెళ్లే జాతీయ రహదారిని ఆనుకుని నిర్మించనున్న సాలూరు బైపాస్‌కు ఈ రోడ్డు నిర్మాణాన్ని లింక్‌ చేశారు. అయితే అప్పట్లో జాతీయ రహదారి పక్కన ఉన్న తారాపురం గ్రామం వద్ద సుమారు 300 అడుగుల వరకు రోడ్డు విస్తరణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.విస్తరణ వల్ల రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలు కోల్పోతున్న నివాసాల యజమానులు విస్తరణ పనులు అడ్డుకున్నారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి విస్తరణ వల్ల భవనాలు కోలోతున్న బాధితులతో పాటు గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామంటూ రాజీ యత్నం చేశారు. అయితే బాధితులు మాత్రం అధిక మొత్తంలో నష్టనరిహారం చెల్లించి, ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బాధితుల డిమాండ్ల పరిష్కారం విషయంలో ఇరు పక్షాలకు పొంతన కుదరకపోవడంతో చర్చలు సఫలం కాలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో మళ్లీ అధికారులు రంగంలోకి దిగి బాధితులతో చర్చలు జరిపారు. తాము చాలా నష్టపోతున్నామని, రూ.లక్షలు విలువ చేసే ఇళ్లకు ప్రభుత్వ విలువ ప్రకారం రూ.వేలల్లో ఇస్తామంటే ఎలా అని బాధితులు ప్రశ్నించారు.రోడ్డుకు ఇరువైపులా కొంత మంది వ్యాపారాలు చేస్తూ దశాబ్దాల కాలంగా ఉంటున్న తమకు సంబంధించిన భవనాలను కూల్చివేస్తే జీవనాధారం కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని తమ డిమాండ్‌కు అనుగుణంగా

పరిహారం ఇస్తే తప్పితే తమ భవనాలను కూల్చే ప్రసక్తే లేదని బాధితులు ససేమిరా అనడంతో చర్చలు మళ్లీ విఫలమయ్యాయి. నష్టపరిహారం చెల్లింపు విషయంలో టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు మీనమేషాలు లెక్కించింది.అయితే రెవెన్యూ అధికారులు మళ్లీ రంగంలోకి దిగా రాజీయత్నం చేశారు.ఎట్టకేలకు రోడ్డు పక్కన ఉన్న 159 మంది ఇళ్లకు రూ.5.54 కోట్లు పరిహారం విడుదల చేసింది. కోల్పోతున్న ఇంటి అంచనాను బట్టి పలువురు బాధితులకు లక్షల్లో, మరి కొంత మంది బాధితులకు రూ.వేలల్లో పరిహారం విడుదల చేసింది. ఈ మేరకు తహసీల్దార్‌ బాధితులతో సమావేశం ఏర్పాటు చేసి వారి ఖాతాలకు పరిహారం జమచేసేందుకు బ్యాంకు ఖాతాలు తదితర వివరాలను సేకరించారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో కొట్టక్కి నుంచి గజపతినగరం వరకు

26వ నంబరు జాతీయ రహదారిపై టూ లేన్‌ నిర్మాణం

రూ.221.40 కోట్లతో చేపట్టిన

రహదారి పనులు

రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోతామని అడ్డుపడిన తారాపురం వాసులు

అర్ధాంతరంగా ఆగిన జాతీయ

రహదారి విస్తరణ

బాధితులతో పలుమార్లు చర్చలు జరిపిన రెవెన్యూ అధికారులు

ఎట్టకేలకు చర్చలు సఫలం

159 మంది నిర్వాసితులకు పరిహారం రూ.5.54 కోట్లు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement