చేతబడి నెపంతో దారుణం | - | Sakshi
Sakshi News home page

చేతబడి నెపంతో దారుణం

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

దంపతులపై పొరిగింటి వారి దాడి

మక్కువ మండలం పెద్దగేశీలలో ఘటన

ఆస్పత్రికి బాధితుల తరలింపు

పార్వతీపురం రూరల్‌ /మక్కువ: మూఢనమ్మకం పెనుభూతమై ఓ వృద్ధ జంటపై పడగవిప్పింది. ‘చేతబడి’ చేస్తున్నారనే నెపంతో పచ్చని పల్లెలో పగలు బుసకొట్టాయి. మక్కువ మండలం పెద్దగేశీలలో దంపతులపై పొరుగున ఉండే రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కానిక జయమ్మ, అప్పలస్వామి దంపతులపై..అదే వీధికి చెందిన దుంపే, రాయిపిల్లి కుటుంబస్తులు తమకు చిల్లంగి (చేతబడి) చేస్తున్నారనే అనుమానంతో తరచూ కయ్యానికి దిగేవారు. ఈ క్రమంలోనే తాజాగా దంపతులిద్దరిపై ఏడుగురు కలిసి మంగళవారం మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో జయమ్మ తలకు తీవ్ర గాయమై ఏడు కుట్లు పడగా, అప్పలస్వామి తల, ఛాతీ, మోకాళ్లపై బలమైన దెబ్బలు తగిలాయి. దాడిలో గాయాలపాలైన తన తల్లిదండ్రులను చూసి చలించిపోయిన వారి కుమార్తె..హుటాహుటిన మక్కువ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించింది. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం పార్వ

తీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. గతంలోనూ మాటువేసి దెబ్బతీశారని, ఆ రెండు కుటుంబాల నుంచి తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని వెల్లడించింది.

ఐదేళ్లుగా నరకం: బాధితుల కుమార్తె ఇందిర

చేతబడి నెపంతో గత ఐదేళ్లుగా కొందరు వ్యక్తులు తమ తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారని బాధితుల కుమార్తె ఇందిర ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఇంట్లో లేని సమ యం చూసి.. ఇంటి నుంచి బయటకు లాగి, కరల్రు, రాళ్లు, గిన్నెలతో అత్యంత దారుణంగా దాడి చేసేవా రని వాపోయింది. 2021లో కూడా ఈ వివాదం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వద్దకు వెళ్లగా.. నిందితులు బతిమి లాడడంతో అప్పట్లో వదిలేశామని, అదే ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చిందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. తాజా ఘటనలో ఏకంగా వెనుక నుంచి వచ్చి కత్తితో దాడి చేశారని వెల్లడించింది. ప్రాణభయంతో నేరుగా మక్కువ పోలీస్‌ స్టేషనన్‌కు పరుగెత్తి ఫిర్యాదు చేశామని..పోలీసులే స్పందించి అంబులెన్స్‌లో ఆస్పత్రికి పంపించారని వివరించింది.

స్థల వివాదమే నేపథ్యం..

ఈ దాడి ఘటనపై మక్కువ ఎస్సై వెంకటరమణ మాట్లాడుతూ.. మార్కొండపుట్టి పంచాయతీ పరిధి లోని పెదగైశీల గ్రామానికి చెందిన డోనక జయమ్మ, అప్పలస్వామి కుటుంబానికి, నిందితులకు మధ్య గతంలో స్థల వివాదం ఉందన్నారు. ఆ గొడవల నేపథ్యంలో అప్పట్లోనే ఇరు పక్షాలపై శ్రీబైండోవర్‌శ్రీ కేసులు కూడా నమోదు చేశామని స్పష్టం చేశారు. తాజా దాడిలో బాధితులు స్టేషన్‌న్‌కు రాగానే తక్షణమే స్పందించి పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement