గుమ్మలక్ష్మీపురం: జమ్మూ కశ్మీర్‌లో ఈ నెల 22 నుంచి జరగనున్న అండర్ 10– బాలబాలికల జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న నిమ్మల దేశిఖ్ రామ్ సోమవారం పయనమయ్యాడు. ఈ మేరకు దేశిక్ రామ్ విజయనగరంలో గల కస్పా స్కూల్స్ వేదికగా ఈ నెల 4వ తేదీన జరిగిన అండర్–10, అండర్–12 ఫెన్సింగ్ ఇండివిడ్యువల్ బాల, బాలికల రాష్ట్ర స్థాయి సెలక్షన్ ట్రయల్స్ ఫెన్సింగ్ క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై , ఇదే నెలలో 5, 6 తేదీల్లో విజయవాడలో గల అలపతి రామారావు అనుమోలు లక్ష్మణరావు ఫంక్షన్ హాల్, (హనుమాన్ పేట)లో జరిగిన రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ వ్యక్తిగత క్రీడా విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకం గెలుపొంది, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యడు.


