అర్జీ వస్తే.. పరిష్కారం కావాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

అర్జీ వస్తే.. పరిష్కారం కావాల్సిందే..

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

జేసీ సేతుమాధవన్‌

పీజీఆర్‌ఎస్‌లో 263 వినతులు

ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి

పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించేలా చూడడంతో పాటు, ప్రభుత్వ సేవలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్‌, ఐవీఆర్‌ఎస్‌ సర్వే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్థితిగతులపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, జిల్లా అధికారులు పాల్గొనగా, ఆర్‌డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఆన్‌న్‌లైన్‌ ద్వారా హాజరయ్యారు.

న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

విజయనగరం టౌన్‌: ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి, న్యా యం చేయాలని ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ అధికారులకు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా 45 ఫిర్యాదులను స్వీకరించగా వాటిలో భూతగాదాలకు సంబంధించి 18, కుటుంబ కలహాలకు సంబంధించి నాలుగు, మోసాలకు పాల్పడినట్లు నాలుగు, ఇతర అంశాలకు సంబంధించినవి 19 ఫిర్యాదులు ఉన్నాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించి వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలపై చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడ్మిన్‌ ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్‌బీ సీఐ కె.కుమారస్వామి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

విజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యం అని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహంచిన పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల నుంచి 263 వినతులు స్వీకరించారు. వాటిలో 150 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. ప్రజలు తమ సమస్యలను జేసీ దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను ప్రత్యేకంగా సమీక్షించి ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా రెవెన్యూ, భూ వివాదాలు, భూసర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అవసరమైన చోట అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, ఫిర్యాదుదారుతో మాట్లాడిన అనంతరం మాత్రమే నివేదిక సమర్పించాలని జేసీ స్పష్టం చేశారు. అర్జీదారుతో మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికలో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. పరిష్కరించిన వివరాలను ఫిర్యాదుదారులకు తెలియాజేయాలని సూచించారు. 1100 టోల్‌ఫ్రీ ద్వారా వచ్చే వినతుల పరిష్కారంలోనూ జాప్యం ఉండకూడదని, ప్రజలు ఈ సేవలను వినియోగించుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్‌.సత్తిబాబు, పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి ఇ.మురళి, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement