విజయనగరం క్రైమ్: నవయుగ వైతాళికుడు, మహా కవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి వేడుకలు విజయనగరం పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గురజాడ స్వగృహం, గురజాడ కాంస్య విగ్రహం వద్ద వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, ఎన్‌ఆర్‌ఐ, సెర్ఫ్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురజాడ స్వగృహానికి చేరుకుని, గురజాడ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి వేడుకలకు శ్రీకారం చుట్టారు. అనంతరం స్వగృహంలోని గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తరువాత గురజాడ స్వగృహం నుంచి గురజాడ కాంస్య విగ్రహం వరకు నిర్వహించిన గురజాడ గీతాలాపన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. గురజాడ సాహిత్య, సామాజిక సంస్కరణల స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం సాగింది. అనంతరం గురజాడ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహాకవి గురజాడ వెంకట అప్పారావు తెలుగు సాహిత్యానికి, సామాజిక సంస్కరణలకు అందించిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, ఎన్‌ఆర్‌ఐ, సెర్ఫ్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురజాడ రచనలు సమాజంలో మార్పుకు, ప్రజల్లో చైతన్యానికి మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు.‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అంటూ గురజాడ అందించిన సందేశం నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. బాల్యవివాహాలు, సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాల నిర్మూలనకు గురజాడ చేసిన కృషి సమాజానికి ఆదర్శప్రాయమని తెలిపారు. గురజాడ ఆశయాలను భావిత


