వైఎస్సార్‌సీపీలో 50 కుటుంబాల చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో 50 కుటుంబాల చేరిక

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం

జియ్యమ్మవలస రూరల్‌: గుమ్మలక్ష్మీపురం మండలం దిగువమండ పంచాయతీ మాజీ సర్పంచ్‌ మోటిక లక్ష్మయ్య ఆధ్వర్యంలో 50 గిరిజన కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. వారందరికీ చినమేరంగిలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి సోమవారం వైఎస్సార్‌సీపీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కుంభరూక గ్రామానికి చెందిన నీలమ్మ, కిల్లక శాంతమ్మ, ఆరిక రమేష్‌, తోయక సురేష్‌, ఆరిక సూర్యారావు, గణపతి, హిమరక వినోద్‌, మూటక గురునాథం, ఆర్థిక సుహాసిని, టిక్కబాయి గ్రామం నుంచి బిడ్డిక మానస, మందంగి సుక్కు శివ,సుందర్రావు, తదితరులు కాగా మల్లుగూడ గ్రామం నుంచి మండంగి నాగేశ్వరరావు ఆరిక భూషణరావు మండంగి చిరంజీవి తదితరుల కుటుంబాలు ఉన్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అనేక సంక్షేమ ఫలాలను అందించినప్పటికీ గత ఎన్నికల్లో కూటమి నాయకులు అమలు కానీ హామీలు ఇవ్వడంతో వారి మాటలు విని మోసపోయమని తెలిపారు. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు మా గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తిరిగి మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరక తప్పదని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దీనమయ్య, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మక గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement