● జేసీకి రైతుల వినతి
రేగిడి: రేగిడి మండలం సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగా రాన్ని మూసి వేయకుండా చూడాలని రైతులు విజయనగరం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో సోమవారం జేసీ సేతుమాధవన్‌కు వినతిపత్రం అందజేశారు. కర్మాగారం మూసివేస్తే వేలాది మంది చెరకు రైతులతోపాటు గ్రామీణ వ్యవసాయ కూలీ లు, కార్మికులు, స్థానిక ప్రజలు జీవనోపాధి కోల్పోతారని సుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి సభ్యుడు, ఏపీ చెరకు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు జేసీకి తెలియజేశారు.


