ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు 90 మంది ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు 90 మంది ఎంపిక

Sep 5 2026 7:13 AM | Updated on Sep 5 2026 7:13 AM

విజయనగరం అర్బన్‌: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని 90 మంది ఉపాధ్యాయులను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లా విద్యాశాఖ ఎంపిక చేసింది. విద్యారంగంలో విశిష్ట సేవలందించిన వారిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. అవార్డులకు ఎంపికై న వారిలో ఉపాధ్యాయ కేటగిరీ వారీగా ప్రధానోపాధ్యాయులు ఐదుగురు, స్కూల్‌ అసిస్టెంట్లు 56 మంది, ఎస్జీటీలు 29 మంది ఉన్నారు. స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ముఖ్యఅతిథిగా హాజరై, ఎంపికై న ఉపాధ్యాయులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేస్తారన్నారు.

సీఎం సార్‌.. మా డబ్బులు మాకివ్వండి

బొబ్బిలి: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 లక్షల మంది ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని విశ్రాంత ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. బొబ్బిలి లోని విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయం వద్ద సీఎం సార్‌.. మా డబ్బులు మాకివ్వడంటూ శుక్రవారం నిరసన తెలిపారు. డీఆర్‌ బకాయిలు చెల్లించాలని, మధ్యంతర భృతిని 30 శాతం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు రౌతు రామ్మూర్తినాయుడు, సెక్రటరీ ఎల్‌.జగన్నాథం, బి.సత్యనారాయణ, సంగమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement