● నెలకు 1200 నుంచి 1500 నమోదు
● మద్యం, పొగతాగేవారిలో అధికం
● వయసుతో సంబంధం లేకుండా వస్తున్న వ్యాధి
● ఒక్క సారిగా తలనిరుత్తుత, నడవలేక పోవడం, తడబడడం
● ఒక్కసారిగా చూపు మసకబారడం
● ముఖం ఒక వైపు వంగిపోవడం, నవ్వలేక పోవడం ● ఒక చెయ్యి బలహీనంగా ఉండడం, లేవలేకపోవడం ● మాటలు అడ్డంగా రావడం, గందర గోళంగా మాట్లాడడం
● మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ● పొగ, మద్యం తాగడం ● తీవ్రమైన ఒత్తిడి, ఊబకాయం, కాలుష్యం ● గర్భ నిరోధక మాత్రలు వాడడం ● గుండె జబ్బులు ● శారీరక శ్రమ లేక పోవడం
విజయనగరం ఫోర్ట్: అనేక మంది ఇటీవల కాలంలో స్ట్రోక్(పక్షవాతం) బారిన పడుతున్నారు. రోజురోజుకు పక్షవాతం బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే మృత్యువాత పడే ప్రమాదం ఉంది. గతంలో 55, 60 ఏళ్ల దాటిన వారు స్ట్రోక్‌కు గురయ్యేవారు. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా తక్కువవయసు వారు కూడా పక్షవాతం బారిన పడుతున్నారు.
సకాలంలో ఆస్పత్రికి చేర్చాలి
స్ట్రోక్ గురైన వ్యక్తిని నాలుగున్నర గంటల లోగా ఆస్పత్రిలో చేర్పించాలి. సి.టి స్కాన్ ద్వారా ఏరకమైన బ్రెయిన్ స్ట్రోక్ అనేది నిర్ధారిస్తారు. ఇస్కిమిక్ స్ట్రోక్ (రక్తనాళాల్లో గడ్డలు) గా నిర్ధారించిన వారికి ద్రోంబలైజ ఇంజక్షన్ చేస్తారు. అవసరమైతే 12 గంటలలోపు క్యాథ్ ల్యాబ్‌కు తీసుకువెళ్లి రక్తనాళాల్లో గడ్డలు తొలగిస్తారు. ఈరకమైన చికిత్స వల్ల రోగికి వైకల్యం రాకుండా చూడగలుగుతారు. స్ట్రోక్‌కు గురైన వారిలో 85 శాతంమందికి ఇస్కిమిక్ స్ట్రోక్ రాగా 15 శాతం హెమరైజ్ స్ట్రోక్‌కు గురవుతారు. పక్షవాతానికి గురైన రోగులకు రిహాబిలిటేషన్ చాలా ముఖ్యం. కనీసం మూడు నుంచి ఆరు నెలలు జాగ్రత్తగా ఉంటూ పిజియోథెరపీ చేయించుకోవాలి.
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పక్షవాతం రోగులు
స్ట్రోక్ లక్షణాలు
పక్షవాతం
రావడానికి కారణం
అవగాహన పెంచుకోవాలి
ప్రతి ఒక్కరూ పక్షవాతం పట్ల అవగాహన పెంచుకోవాలి. స్ట్రోక్ వచ్చిన నాలుగున్నర గంటలు లోగా ఆస్పత్రిలో చేర్పించాలి. దీని వల్ల ప్రాణనష్టం, వైకల్యం బారిన పడకుండా చూడవచ్చు. బీపీ, సుగర్ వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవాలి. స్ట్రోక్ తీవ్ర సమస్య అయినప్పటికీ 80 శాతం వరకు నివారించవచ్చు. మద్యం, పొగ తాగడం మానుకోవాలి. రోజుకు కనీసం 15 నుంచి 25 నిమిషాల పాటు వ్యాయమం చేయాలి. ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తగ్గించుకోవాలి. ఒత్తిడిని తగ్గించికుని ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ ఏడున్నర గంటల పాటు నిద్ర పోవాలి. డాక్టర్ ఎస్.వెంకటేష్,
అసిస్టెంట్ ప్రొపెసర్, న్యూరోమెడిసిన్
విబాగం , ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. రోజూ చెక్ చేసుకుంటూ ఉండాలి
మందులు వాడడం మానకూడదు
మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి
పొగ, మద్యం తాగండం మానివేయాలి
పొగతాగడం రక్తనాళాలను దెబ్బతీస్తుంది
మద్యం స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది
ప్రతిరోజు 30 నిమిషాల పాటు నడవడం, వ్యాయమం చేయాలి. దీని వల్ల మెదడుకు ఆరోగ్యంగా ఉంటుంది
ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధాన్యం, యోగా విశ్రాంతి ద్వారా ఒత్తిడిని జయించవచ్చు
హృదయ సమస్యలను పట్టించుకోవాలి
స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.


