ఉపాధ్యాయుల మెరుపు ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల మెరుపు ధర్నా

Aug 14 2026 7:20 AM | Updated on Aug 14 2026 7:20 AM

బొబ్బిలి/బొబ్బిలి రూరల్‌: ఉప ఖజానా కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట గురువారం సాయంత్రం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు మెరుపు ధర్నాకు దిగారు. ఎంటీఎస్‌ ఉపాధ్యాయుల జీతాల బిల్లులు పెట్టేందుకు రూ.10వేల లంచం అడుగుతూ ఎస్టీఓ మోకాలొడ్డుతున్నారని ఎస్టీఓ జిల్లా అధ్యక్షుడు కురమాన జోగారావు ఆరోపించారు. లంచం అడగడంపై ప్రశ్నించినందుకు తనను, ఎంఈఓలను దూషించారని, తనపై పోలీసు ఫిర్యాదు ఇచ్చారన్నారు. ఎస్టీఓ పనితీరు బాగులేని ఆరోపించారు. ఎస్టీఓ అక్రమాలు, అవినీతిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ ఎం.శ్రీనుకు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement