● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్: పింఛన్ల పంపిణీలో లబ్ధిదారుల సంతృప్తినే సేవల నాణ్యతకు అసలైన కొలమానంగా తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పింఛన్ల పంపిణీ, ఐవీఆర్‌ఎస్‌లో నమోదువుతున్న ప్రజాభిప్రాయం, సచివాలయల పనితీరుపై గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో సమీక్షించారు. ఇంటి వద్ద పింఛన్ల పంపిణీ అంశంపై 85.64 శాతం సానుకూల స్పందన నమోదైందని, ఇది గత ఆరు నెలల సగటు 88.49 శాతంలో పోలిస్తే 2.85 శాతం పాయింట్లు తగ్గిందన్నారు. మొదటి రోజే ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. పింఛన్ అనేది ప్రభుత్వ హక్కు అని, దానికోసం లబ్ధిదారులు ఎవరికీ ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 75 శాతం కంటే తక్కువ సంతృప్తి ఉన్న సచివాలయాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి, జెడ్పీ సీఈఓ లోవరాజు, తదితరులు పాల్గొన్నారు.


