దారి దోపిడీ.. | - | Sakshi
Sakshi News home page

దారి దోపిడీ..

Aug 10 2026 2:04 AM | Updated on Aug 10 2026 2:04 AM

పాచిపెంట: ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారుల కళ్ల ముందే ప్రభుత్వ రహదారి ఆక్రమణకు గురైంది. పాచిపెంట మండలంలోని పోతులగెడ్డ సమీపంలో పిండ్రంగివలసకు వెళ్లే పీఆర్‌ (పీఐయూ) శాఖకు చెందిన బీటీ రహదారిని ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తన లేఅవుట్‌లో కలిపేశాడు. దీంతో ఏళ్లుగా ప్రజలు వినియోగిస్తున్న పాత రహదారి ఆనవాళ్లు లేకుండా పోయింది. దానికి బదులుగా ప్రభుత్వ భూమిలో కొత్త రహదారిని ఏర్పాటు చేశారు. సుమారు పది ఎకరాల వ్యవసాయ భూమిలో లేఅవుట్‌ అభివృద్ధి చేసే క్రమంలోనే ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రహదారిని లేఅవుట్‌లో కలిపేయడంతోపాటు, ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమిలో రహదారి ఏర్పాటు చేయడంతో అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. గతంలోనూ ఈ విషయంపై వార్తలు వచ్చినా సంబంధిత రెవెన్యూ, పీఆర్‌(పీఐయూ) అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రహదారిని లేఅవుట్‌లో కలిపేసిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు.. ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన కొత్త రహదారికి అనుమతులు ఉన్నాయా? అనే దానిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రభుత్వ రోడ్డునే మింగేసిన రియల్‌ ఎస్టేట్‌ నిర్వాహకుడు

లేఅవుట్‌లో కలిపేసిన పీఆర్‌(పీఐయూ) శాఖ బీటీ రోడ్డు

ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమిలో కొత్తదారి

అధికారుల మౌనంపై విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement