● వరండా చదువులు..! | - | Sakshi
Sakshi News home page

● వరండా చదువులు..!

Aug 10 2026 2:04 AM | Updated on Aug 10 2026 2:04 AM

పాఠశాల

వరండాలోనే

విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయిని

మెరకముడిదాం మండలం బుధరాయవలస జెడ్పీ పాఠశాల విద్యార్థులకు వరండాలే తరగతి గదులయ్యాయి. ఇక్కడ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 195 మంది విద్యార్థులున్నారు. వీరికి అవసరమైన మేరకు తరగతి గదుల్లేవు. దీంతో ఐదు తరగతులకు వరండాల్లోనూ, కళావేదికపైన బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో అదనపు తరగతి గదులు నిర్మించేందుకు పునాదులు వేసినా వాటి నిర్మాణ పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.

– మెరకముడిదాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement