నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

Aug 10 2026 2:04 AM | Updated on Aug 10 2026 2:04 AM

విజయనగరం గంటస్తంభం: ప్రజల సమస్యలకు వేగవంతమైన, పారదర్శక పరిష్కారం అందించేందుకు సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపడతారన్నారు. అర్జీదారులు తమ పేరు, చిరునామా, మొబైల్‌ నంబర్‌తో పాటు సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధార పత్రాలను జత చేయాలని సూచించారు. గతంలో ఫిర్యాదు చేసిన వారు పాత అర్జీ రశీదును వెంట తీసుకురావాలన్నారు. ఫిర్యాదుల స్థితిగతులను ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని, సమస్య పరిష్కారమైన అనంతరం సంబంఽధిత ఉత్తర్వులు, ఎండార్స్‌మెంట్లను వాట్సాప్‌, రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా పంపిస్తామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌ నిర్వహిస్తున్నామని, ఇందులో ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. భూ వివాదాలు, మ్యుటేషన్లు, సర్వేలు, ఇతర రెవెన్యూ సమస్యలపై రైతులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టరేట్‌కు హాజరు కాలేని వారు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా లేదా మీకోసం వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని, మండల, మున్సిపల్‌ కార్యాలయాల్లోనూ అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement