● ముగ్గురు నిందితుల అరెస్ట్
● బంగారం, నగదు,
వాహనాలు స్వాధీనం
పాచిపెంట: సాలూరు పట్టణంలోని గుమడాంలో ఏప్రిల్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 తులాల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు, రూ.19 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు సాలూరు టౌనన్ సీఐ అప్పలనాయుడు తెలిపారు.


