పాలకొండ రూరల్: ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఆషాడమాస పూజల్లో భాగాంగా ఆదివారం ప్రత్యేక సంబరాలు చేపట్టారు. ముర్రాటలు, ఘటాలతో దేవస్థానానికి చేరుకుని మొక్కులు చెల్లించారు. ఈ క్రమంలో స్థానిక గురువు గారి వీది, రజకవీధికి చెందిన మహిళలు సామూహికంగా అమ్మవారికి సారె సమర్పించారు. దేవస్థానం ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మి ప్రసాదశర్మ నేతృత్వంలో భక్తులు సమర్పించిన సారె అమ్మవారికి నివేదన చేసి, ప్రత్యేక పూజలు చేపట్టారు. పట్టణంతోపాటు మండల పరిధి భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు.


