ఏపీసీ ఏమన్నారంటే...
● రెండు నెలలుగా నిలిచిన వేతనాలు ● జిల్లాలో 800 మంది ఉద్యోగులు ● కుటుంబ పోషణకు ఆర్థిక కష్టాలు
సీతంపేట:
సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఆర్థిక కష్టాలు తప్ప డం లేదు. నెలవారీ జీతాలు అందక పోవడంతో వారి జీవనం కష్టతాయకంగా మారింది. రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కు సతమతం అవుతున్నారు. పార్వతీపురం జిల్లా లో సుమారు 800 మంది ఉద్యోగులకు వేతనాలు నిలిచిపోయాయి. దీంతో ఇంటి అద్దె నుంచి పిల్లల చదువులు, నిత్యావసరాల నుంచి వైద్య ఖర్చులు భారంగా మారాయి. మరోవైపు చాలీచాలని జీతాల తో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
800 కుటుంబాలు సతమతం..
జిల్లాలో ఎల్‌ఈఆర్‌పీలు 29, ఎంఐఎస్ కోఆర్డినేట ర్లు 15, సీఆర్‌ఎం టీచర్లు 108, డాటా ఎంట్రీ ఆపరేటర్లు 15, 14 కేజీబీవీల్లో టీచింగ్ అండ్ నాన్‌టీచింగ్ సిబ్బంది 345.. మొత్తం 512 మంది పని చేస్తున్నా రు. మెసేంజర్లు, అక్కౌంట్ సిబ్బంది, ఫిజియోథెర ఫిస్టులు, పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్లర్లు మరో 300 మంది వరకు పని చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వీరందరికీ జీతాలు పెరిగాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క రూపాయి అధికం కాకపోగా.. నెలనెలా జీతాలు ఇవ్వడం లదేని సిబ్బంది నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.
హామీ అమలు ఎక్కడ?..
ఎన్నికల ప్రచార సమయంలో రెగ్యులర్ ఉద్యోగుల తో పాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యో గులందరికీ ప్రతి నెల ఒకటో తేదీన తప్పనిసరిగా జీతాలు జమ అయ్యేలా తాము బాధ్యత తీసుకుంటామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆ హామీ అమలులో కనిపించడం లేదని మండి పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాకార్యక్రమాల అమలు, కేజీబీవీల నిర్వహణ, పిల్లలకు సేవ లు, విద్యాసర్వేలు, డేటా నిర్వహణ, శిక్షణా కార్యక్రమాల అమలు వంటి కీలక విధులు నిర్వర్తిస్తున్నా రు. వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ విధులకు హాజరై తమ బాధ్యత లు నిర్వర్తిస్తున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదని పలుమా ర్లు సంబంధిత అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తున్నా.. శాశ్వత పరిష్కారం లేదని సంబంధిత సంఘాల నాయకులు చెబుతున్నారు.
ఓఎస్‌పీ సర్వేలతో తిప్పలు...
సీఆర్‌ఎం టీచర్లను తమ విధులతో పాటు అదనంగా ఓఎస్‌పీ(అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్) సర్వేలు చేపట్టాలని, ప్రతి గ్రామాన్ని సందర్శించి ఓఎస్‌సీ సర్వే చేసి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలనే పని అప్పగించారు. అంతేకాకుండా ప్రతి పాఠశాలకు వెళ్లి సర్వేపల్లి రాథాకృష్ణన్ కిట్లు 100 శాతం అందజే సే విధంగా పంపిణీ చేయాలని ఆదేశాలు ఉన్నా యి. వీటికి ప్రత్యేక అలవెన్సులు వంటివి లేకపోవడం, వాహన సదుపాయాలు వారే సమకూర్చుకుని వెళ్లాలంటే పెట్రోల్ తదిర ఖర్చులు కూడా వీరే భరించుకోవాలి. ఈ క్రమంలో జీతాలు లేకుండా పనిచేస్తున్న తమకు అదనపు భారం పరిణమించిందని వారు వాపోతున్నారు.
ఈ విషయమై సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డి నేటర్(ఏపీసీ) రాజ్‌కుమార్ వద్ద సాక్షి ప్రస్తావించగా.. త్వరలోనే జీతాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త బడ్జెట్ రావడం ఆలస్యం అవడంతో ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు.


