ఆదివాసీలకు మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీలకు మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు

Aug 9 2026 2:28 AM | Updated on Aug 9 2026 2:28 AM

సీతంపేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని గిరిజన సోదర, సోదరీమణులకు పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, జీవన విధానం దేశ సాంస్కృతిక వైవిద్యానికి ప్రతీకలన్నారు. గిరిజనుల అభ్యున్నతికి విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, ఉపాది వంటి మౌలిక సదుపాయాలు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు పాలకులు దృష్టి సారించాలని కోరారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement