ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి

రాజాం సిటీ: విధులకు హాజరై ఇంటికి తిరిగి వస్తు న్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు కాటేసింది. పొందూరు మండలం అంతకాపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో మలుపువద్ద రాజాం నుంచి శ్రీకాకుళం వైపు వె ళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఒడిశా రాష్ట్రంలోని బరంపురానికి చెందిన యువకుడు సమ్మ సా యిసురేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. బరంపురానికి చెందిన సమ్మ సాయిసురేష్‌ (30) కుటుంబంతో సహా ఏడాది క్రితం రాజాం వచ్చాడు. తండ్రి సతీష్‌బాబు అనారోగ్యానికి గు రికావడంతో రాజాంలో బజాజ్‌ ఫైనాన్స్‌లో సేల్స్‌మేనేజర్‌గా జాయిన్‌ అయ్యాడు. ప్రతిరోజూ ఉదయం 9గంటలకు విధులకు వెళ్లి వివిధ ప్రాంతాల్లో సందర్శించి రాత్రి 9గంటల సమయంలో ఇంటికి చేరేవాడు. ఎప్పటిలాగే శుక్రవారం విధులకు హాజరైన సురేష్‌ పొందూరు వెళ్లి తిరుగు ప్రయాణంలో బైక్‌పై వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో సంఘట నా స్థలంలోనే మృతిచెందాడు. ఈ విషయాన్ని సహోద్యోగి పి.ప్రకాశరావు కుటుంబసభ్యులకు తెలపడంతో సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. మృతునికి తల్లి ధనలక్ష్మి, తండ్రి సతీష్‌బాబు, ఓ సోదరి ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ధ నలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చే స్తున్నామని ఎస్సై మహ్మద్‌ సల్మాన్‌ బేగ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement