జిల్లాలో ఐదు సీహెచ్‌సీల ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఐదు సీహెచ్‌సీల ఏర్పాటు

Aug 7 2026 12:50 AM | Updated on Aug 7 2026 12:50 AM

జిల్లాలో ఐదు సీహెచ్‌సీల ఏర్పాటు

లైవ్‌లీ హుడ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ ఎస్‌.రాజ్‌కుమార్‌

రామభద్రపురం: జిల్లాలో రైతులకు ఉపయోగపడే విధంగా రూ.75 లక్షలతో ఐదు కస్టమ్స్‌ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా లైవ్‌లీ హుడ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ ఎస్‌.రాజ్‌కుమార్‌ అన్నారు. ఈ మేరకు మండలకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో సీహెచ్‌సీ షెడ్డు నిర్మాణానికి అవసరమైన స్థల పరిశీలన గురువారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 27 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు మంజూరు కాగా మొదటి విడతలో రామభద్రపురం, దత్తిరాజేరు, గజపతినగరం, గంట్యాడ, ఎల్‌కోట మండలాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అయితే ఈ సీహెచ్‌సీలలో రైతుల వ్యవసాయ సాగుకు అవసరమైన ట్రాక్టర్లు, రొటొవేటర్లు, పవర్‌ ట్రిల్లర్స్‌, స్ప్రేయర్స్‌ దమ్ము సెట్లు తదితర వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉంచుతూ ఎఫ్‌పీవోల ద్వారా తక్కువ ధరలకు అద్దెకు ఇవ్వనున్నారన్నారు.ఈ నెల 15 లోగా అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే జిల్లాలోని 117 ఎకరాల్లో మునగసాగు వేసేలా చర్యలు తీసుకుంటా మన్నారు. పెరియా కులం యూనివర్సిటీ నుంచి పీకేఎం మునగ విత్తనం తెప్పిస్తున్నామని తెలిపారు. ఈ మునగ పంట నుంచి కాయలు కాకుండా ఆకులు కోసి బాగా ఆరబెట్టి పొడి తయారు చేసి విక్రయించనున్నారన్నారు. దత్తిరాజేరు మండలంలో ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే 5 మండలాల్లో 406 మంది రైతులతో వెదురు సాగు చేసేందుకు ఎంపిక చేశామన్నారు. మునగ, వెదురు సాగు చేసే రైతులకు వీబీజీ రామ్‌జీ పథకం నుంచి ఆర్థిక సాయం అందిచనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏపీఎం సత్యవతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement