అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలకు స్పందన | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలకు స్పందన

Aug 3 2026 4:03 AM | Updated on Aug 3 2026 4:03 AM

అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలకు స్పందన

విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. నగర శివారులో గల విజ్జి స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పోటీలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 600మంది కీడాకారులు హాజరయ్యారు. అండర్‌–14,16,18, 20 విభాగాల్లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించినట్లు జిల్లా అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు లీలా కృష్ణ, శ్రీకాంత్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement