30న అమరావతి చాంపియన్‌షిప్‌ క్రీడా పోటీలకు ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

30న అమరావతి చాంపియన్‌షిప్‌ క్రీడా పోటీలకు ఎంపికలు

Jul 21 2026 12:41 AM | Updated on Jul 21 2026 12:41 AM

రాజాం సిటీ: అమరావతి చాంపియన్‌షిప్‌ క్రీడా పోటీలకు ఈ నెల 30న ఎంపికలు చేయనున్నామని ఎంపీడీఓ జె.ఆనందకుమార్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల స్పోర్ట్స్‌ ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక జీసీఎస్‌ఆర్‌ కళాశాల మైదానంలో అండర్‌–17, అండర్‌–23 సీ్త్ర, పురుషుల విభాగంలో నిర్వహించనున్నామన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, షటిల్‌, యోగా, చెస్‌ తదితర ఆరు అంశాల్లో ఈ పోటీలు ఉంటాయని చెప్పారు. పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు ముందుగా ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని, ఒక క్రీడాకారుడు ఒక అంశంలో మాత్రమే పాల్గొనాలని సూచించారు. ఇక్కడ గెలుపొందిన విజేతలు జిల్లా స్థాయిలోను, అక్కడినుంచి రాష్ట్రస్థాయిలో జరగనున్న పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు ఆధార్‌కార్డు, వయసు ధ్రువీకరణకు సంబంధించి పదవ తరగతి సర్టిఫికెట్‌ తీసుకుని రావాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓలు పి.ప్రవీణ్‌కుమార్‌, వై.దుర్గారావు, పోటీల నియోజకవర్గ ఇన్‌చార్జి చీమల రేణుకాదేవి, నాలుగు మండలాల పీడీలు, ఎంఎస్‌ఓలు సత్యనారాయణ, దుర్గయ్య, రవి, అజయ్‌, రోజారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement