పంటల బీమా.. గోల్‌మాల్‌..! | - | Sakshi
Sakshi News home page

పంటల బీమా.. గోల్‌మాల్‌..!

Jul 21 2026 12:29 AM | Updated on Jul 21 2026 12:29 AM

విజయనగరం ఫోర్ట్‌:

జిల్లా వ్యాప్తంగా 2024 – 25 సంవత్సరంలో వేలాది మంది రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లించారు. పంటలు తీవ్రంగా నష్టపోయినా ఒక్క పైసా పరిహారం కూడా రైతులకు రాలేదు. పంటల బీమా ప్రీమియం చెల్లించండి.. పంట నష్టం జరిగితే పరిహారం ఇప్పిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు మాటలు నమ్మి ప్రీమియం వందల రూపాయిల్లో చెల్లించి నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉచిత పంటల బీమా పథకానికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడేసింది. దీంతో రైతులే పంటల బీమా ప్రీమియం కట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఉచిత పంటల బీమా లేకపోయినా.. రైతులు తమ సొంత డబ్బులు వెచ్చించి బీమా ప్రీమియం కట్టారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం రైతులకు పంట నష్టానికి సంబంధించిన బీమా ఏ ఒక్క రైతుకు ఆ రబీ సీజన్‌లో ఇప్పించలేదు. దీంతో ఆర్థికంగా నష్టపోయామని రైతులు పేర్కొంటున్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో..

రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా పథకం పక్కాగా అమలయ్యేది. రైతులు తాము సాగు చేసిన పంటకు ఈ క్రాప్‌ చేసుకుంటే చాలు.. ప్రభుత్వమే రైతుల తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లించేది. అంతేకాకుండా పంట నష్టం జరిగితే ప్రభుత్వమే వారికి బీమా సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకునేది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో

ఉచిత పంటల బీమా

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హాయంలో ఉచిత పంటల బీమా పథకం అమలు అయ్యేది. రైతులు తాము సాగు చేసిన పంటకు ఈ– క్రాప్‌ చేసుకుంటే చాలు ప్రభుత్వమే రైతులు తరుపున పంటల బీమా ప్రీమియం చెల్లించేది. అంతేకాకుండా పంట నష్టం జరిగితే ప్రభుత్వమే వారికి బీమా సకాలంలో అందేవిధంగా చర్యలు తీసుకునేది.

పంటల బీమా ఇంకా రాలేదు..

2024 – 25 సంవత్సరంలో రబీ సీజన్‌కు సంబంధించి పంటల బీమా రైతులకు ఇంకా రాలేదు. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

– వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి

బీమా మొత్తం రూ.1.35 కోట్లు

2024 – 25లో రబీ సీజన్‌ నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం ఎత్తేసింది. రైతులే పంటల బీమా ప్రీమియం చెల్లించుకోవాలని తేల్చి చెప్పింది. దీంతో గత్యంతం లేక అపరాలు(పెసర, మినుము) పంటలకు ఎకరానికి రూ.300 చొప్పున రైతులు పంటల బీమా చెల్లించారు. సుమారుగా జిల్లాలో 45 వేల ఎకరాలకు పంటల బీమా కింద రూ.1.35 కోట్లు వరకు రైతులు చెల్లించారు. అయితే పంటల బీమా మాత్రం ఏ ఒక్క రైతుకు రాలేదు. పంటల బీమా కింద చెల్లించిన ప్రీమియం రూ.కోట్లు నష్టపోయామని రైతులు వాపోతున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయమని ఎన్నికల సమయంలో హామీలిచ్చిన చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు తమకు తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాగూ పంటల బీమా చెల్లించలేదు... తాము కట్టిన ప్రీమియం డబ్బులు కూడా చెల్లించకుంటే ఎలాగని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా తమ బీమా డబ్బులు తమకు ఇప్పించాలని వారు కోరుతున్నారు.

2024 – 25లో అపరాలకు బీమా ప్రీమియం చెల్లించిన రైతులు

రెండేళ్లు కావస్తున్నా అందని బీమా

అన్నదాత ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement