డ్వాక్రా సంఘాలు | - | Sakshi
Sakshi News home page

డ్వాక్రా సంఘాలు

Jul 20 2026 1:08 AM | Updated on Jul 20 2026 1:08 AM

సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026 నీరసించిపోతున్న డ్వాక్రా సంఘాలు ● జిల్లాలో 40,197 డ్వాక్రా సంఘాలు ● ఇందులో బీ గ్రేడ్‌లో 7943 సంఘాలు నేడు ‘షైనింగ్‌ స్టార్స్‌ అవార్డ్స్‌’ ప్రదానోత్సవం సీతారాముల ఖాతాలో రైతుల భూములు మడ్డువలసలో చేపల వేట ప్రారంభం చెరకు పంటను ధ్వంసం చేసిన ఏనుగులు ● నందబలగను వీడిన గజరాజులు నేడు పీజీఆర్‌ఎస్‌ ●చర్యలు తీసుకుంటున్నాం.. ● మహాకవి వారసత్వానికి కూటమి బ్రేక్‌ ● గురజాడ మునిమనవడి కడుపు కొడుతున్న సర్కార్‌ ● పది నెలలుగా జీతాలివ్వక ఆటలాట ● ఇచ్చిన అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం నుంచి తొలగింపు ● మంత్రులకు మొర పెట్టుకున్నా.. కరువైన స్పందన ● ప్రజాకవుల వారసులపై ప్రతీకార చర్యలా?

న్యూస్‌రీల్‌

విజయనగరం
సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026
నీరసించిపోతున్న
● జిల్లాలో 40,197 డ్వాక్రా సంఘాలు ● ఇందులో బీ గ్రేడ్‌లో 7943 సంఘాలు
నేడు ‘షైనింగ్‌ స్టార్స్‌ అవార్డ్స్‌’ ప్రదానోత్సవం
ఏది వాస్తవం..!

ఎన్నో సంవత్సరాల నుంచి సంక్రమించిన, కొనుగోలు చేసిన తమ భూములు మాకు కాకుండా చేయడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో చేపల వేట అధికారికంగా ప్రారంభమైంది. గత కొంత కాలంగా లీజు సొమ్ము చెల్లించకపోవడంతో ప్రాజెక్టులో చేపల వేట నిషేధం అమలులో ఉంది. ఇటీవల లీజు సొమ్ము ప్రభుత్వానికి చెల్లించడంతో అన్ని గ్రామాల్లో ఉన్న మత్స్యకారులు రిజర్వాయర్‌లో చేపల వేట సాగిస్తున్నారు.

తెర్లాం: మండలంలోని నందబలగ పరిసర ప్రాంతాల్లో శనివారం తిష్టవేసిన ఏనుగుల గుంపు ఆదివారం ఉదయం బాడంగి మండలం పినపెంకి గ్రామం వైపు వెళ్లిపోయాయి. శనివా రం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నందబలగ గ్రామ పరిసర పొలాల్లోను, మామిడి తోటలో ఎనిమిది ఏనుగులు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఏనుగుల గుంపు గ్రామానికి చెందిన పలువురి రైతుల చెరకు పంటను ధ్వంసం చేశాయి. చెరకు పంటను తినేయడంతో పాటు, కాళ్లతో తొక్కేయడంతో పంట నాశనమైయిందని గ్రామానికి చెందిన రైతులు లబోదిబోమంటూ విలపిస్తున్నారు. పంటలు నష్టాన్ని గుర్తించి ప్రభుత్వం ద్వారా తమకు నష్టపరిహారం అందజేయాలని వారంతా అధికారులను కోరుతున్నారు. ఆదివారం ఉదయం నందబలగ–పినపెంకి రోడ్డు మీదుగా ఏనుగుల గుంపు పయనించి పినపెంకి సమీపంలోని పంట పొలాల్లోకి వెళ్లిపోయా యి. దీంతో నందబలగ గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

కారాడ వైపు తరలిన ఏనుగులు

బాడంగి: మండలంలోని శివారు గ్రామం పినపెంకి గ్రామ పంట పొలాల్లోకి ఏనుగుల గుంపు ఆదివారం చేరుకుంది. మధ్యాహ్నం వరకు ఆ పరిసరాల్లో సంచరించిన ఏనుగులు తిరిగి బొబ్బిలి మండలం కారాడ వైపు వెళ్లాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సూర్యకుమారి అప్రమత్తమై తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని అటవీ శాఖ అధికారులతో మాట్లాడి గ్రామంలోకి వెళ్లకుండా గస్తీ కాశారు.

విజయనగరం అర్బన్‌: జిల్లా ప్రజల సమస్యల ను త్వరితగతిన పరిష్కరించేందుకు సోమవా రం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ‘ప్రజా సమస్య ల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్టు కలెక్ట ర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొని నేరుగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. అర్జీదారులు దరఖాస్తుల్లో పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌ వంటి పూర్తి వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని, సమస్యకు సంబంధించిన ఆధారాలను జతపరచాలని సూచించారు. గతంలో ఫిర్యాదు చేసిన వారు పాత అర్జీ రశీదును తప్పనిసరిగా తీసుకురావా లని తెలిపారు. అర్జీల స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఎస్‌ఎంఎస్‌ సౌకర్యాన్ని కల్పించిందున, సమస్య పరిష్కారం అనంత రం నోటీసులు లేదా ఎండార్స్‌మెంట్లు వాట్సా ప్‌, రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపుతారని వివరించారు. కలెక్టరేట్‌కు రాలేని వారు 1100 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయడం ద్వారా లేదా ‘మీ కోసం.ఏపీ.జీఓవి.ఐఎన్‌’ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమీపంలోని మండల, మున్సిపల్‌ కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు.

విజయనగరం ఫోర్ట్‌:

డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేసే బాధ్యత మాది.. అంటూ గత సార్వత్రిక ఎన్నికల్లో గొప్పగా ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలో కి వచ్చాక వారికి మొండిచేయి చూపుతున్నారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ అమలు చేస్తామని, ప్రతీ ఒక్కరిని లక్షాధికారిని చేస్తామని హామీ ఇచ్చా రు. దీన్ని నమ్మిన డ్వాక్రా మహిళలు టీడీపీకి ఓట్లు వేసి అధికారం కట్టబెట్టారు. లక్షాధికారుల మాట దేవుడెరుగు డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాల ను చెల్లించడానికి నానా అవస్థలు పడుతున్నారు. తీసుకున్న రుణం వడ్డీతో సహా చెల్లించాల్సి రావడంతో వీరు అష్టకష్టాలు పడుతున్నారు. ఫలితంగా డ్వాక్రా సంఘాలు నీరసించిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరికి అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదనే విమర్శలూ లేకపోలేదు.

సున్నా వడ్డీ ఉత్తిదే..

సున్నా వడ్డీ (వడ్డీ లేని) రుణాలు మహిళలకు ఇస్తా నని ప్రస్తుత సీఎం చంద్రబాబు గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి రెండేళ్లు అవుతున్నా ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదు. దీంతో డ్వాక్రా మహిళలు తాము తీసుకున్న రుణాలను వడ్డీతో సహా ప్రతీ నెల చెల్లిస్తున్నా రు. ఇది వారికి భారంగా మారుతుంది. ప్రస్తుతం వ్యాపారాలు కూడా మందగించాయి. దీంతో వారి జీవనం కష్టతరంగా మారింది. వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్టయితే డ్వాక్రా మహిళలకు ఎంత గానో ఉపయోగపడుతుంది. కాని చంద్రబాబు సర్కార్‌ మాట తప్పడం డ్వాక్రా మహిళల పాలిట శాపంగా మారింది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులు గా ఉన్న మహిళలు తీసుకున్న రుణంతో గేదెలు, ఆవులు కొనుగోలు చేయడం, చిన్న చిన్న వ్యాపారు లు కిరాణా, బట్టలు, పిండి మిల్లులు, పేపర్‌ ప్లేట్‌ ఆకుల మిషన్‌ వంటివి ఏర్పాటు చేసుకుని ప్రతీ నెల కొంత మొత్తాన్ని బ్యాంకుకు కడుతూ ఉంటారు. వడ్డీ లేకుండా కట్టినట్టయితే వారికి వడ్డీగా చెల్లించాల్సిన డబ్బులు మిగులుతాయి.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాఫీ

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేశారు. 2019 ఏప్రిల్‌ నాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాన్ని పూర్తి స్థాయిలో జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మాఫీ చేసింది. అంతేకాకుండా రుణాలు సంక్రమించిన వారికి కోట్లాది రుపాయిలు వడ్డీ రాయితీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితు లు లేకపోవడంతో డ్వాక్రా సంఘాల మహిళలు అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ లు అమలు చేయాలని వారు కోరుతున్నారు.

జిల్లాలోని డ్వాక్రా సంఘాలు అన్నింటిని ఏ గ్రేడ్‌లోకి తీసుకొచ్చేందుకు శాఖా పరమైన చర్యలు తీసుకుంటున్నాం. బీ, సీ, డీ గ్రేడ్‌లో ఉన్న సంఘాలను ఏ గ్రేడ్‌లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాం. ఆ దిశగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం.

– శ్రీనివాసపాణి, పీడీ, డీఆర్‌డీఏ

విజయనగరం అర్బన్‌: మార్చి – 2026లో జరిగిన ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలో అత్యుత్త మ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ‘షైనింగ్‌ స్టార్స్‌ అవార్డ్స్‌’ ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించనున్నారు. పట్టణ శివార్లలోని ఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఉదయం 8.30 గంటలకు ఈ కార్యక్ర మం ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు విజయనగరం జిల్లా వ్యాప్తంగా మొత్తం 184 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అవార్డుకు ఎంపికై న ప్రతి విద్యార్థికి ఒక మెడల్‌, మెరిట్‌ సర్టిఫికెట్‌ తో పాటు రూ.20 వేలు నగదు బహుమతిని అంద జేయనున్నారు. కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులతో కలిసి రేపు ఉద యం 8.30 గంటలకల్లా తప్పనిసరిగా వేదిక వద్దకు చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

సాలూరు: గిరిజన విద్యార్థి మరణంలో వాస్తవమేంటో తెలియదు కానీ ఒక్కొక్కరు ఒక్కో వాదన వినిపిస్తున్నారు. సాలూరు మండలంలోని తోణాం పీహెచ్‌సీ పరిధి ఎగువమెండంగికి చెందిన తాడంగి జోయ్‌(16) మృతిపై ఈ నెల 17న సాక్షిలో జ్వరంతో గిరిజన విద్యార్థి మృతి శీర్షికన వార్త ప్రచురిచతమైంది. దీనిపై తాడంగి జోయ్‌ మూడు రోజుల పాటు తన స్నేహితుడి ఇంట్లో ఉంటూ గంజాయి వంటి మత్తు పదార్థాలు వినియోగించడం వల్లనే మరణించాడని డీఎంహెచ్‌ఓ డా. పి.విజయలక్ష్మి ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై ఈ నెల 19న 16 ఏళ్ల బాలుడు గంజాయికి బానిస? అనే శీర్షికన సాక్షిలో మరో కథనం ప్రచురితమైంది. గంజాయి వినియోగించడం వల్ల విద్యార్థి మరణించాడన్న వైద్యారోగ్య శాఖ ప్రకటన నేడు చర్చనీయాంశంగా మారింది. గంజాయి వంటి మత్తుపదార్థాలు గిరిశిఖర గ్రామాల్లో నిజంగా లభ్యమవుతున్నాయా? నిజంగా వాటిని ఆ 16 ఏళ్ల బాలుడు వినియోగించాడా? తదితర అంశాలపై వాస్తవా లను తెలుసుకునేందుకు ఆదివారం జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఇటు పోలీసులు, అటు వైద్యశాఖ సిబ్బంది ఎగువమెండంగి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. విద్యార్థి తల్లిదండ్రులు తమ బిడ్డకు గంజాయి వంటి ఎటువంటి అలవాట్లు లేవని, జ్వరంతోనే మరణించాడని స్పష్టం చేసినట్లు సమాచారం. జ్వరం, కడుపునొప్పితో మరణించాడని మృతుని తండ్రి దనేల్‌ పోలీసులకు తెలిపినట్లు రూరల్‌ సీఐ రామకృష్ణ స్పష్టం చేశారు. గంజాయికు బానిసై యువకుడు మరణించాడన్నది అవాస్తమని ఆదివారం సాయంత్రం ఎస్పీ మాధవరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థి గంజా యి వంటి మత్తుపదార్థాలు వినియోగించడం వల్ల మరణించాడన్న వైద్యారోగ్యశాఖ ప్రకటన అవాస్తవమని పోలీసుశాఖ తన ప్రకటన ద్వారా స్పష్టంచేసింది. ఆ గిరిజన విద్యార్థి పదవ తరగతిలో ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుకుని 503 మార్కులు సాధించాడు. తమ బిడ్డకే కాదు. గ్రామంలో ఎవరికీ ఇటువంటి అలవాట్లేమీ లేవని మృతుడి తల్లిదండ్రులు విచారణలో స్పష్టం చేశారు.

గిరిజన విద్యార్థి మృతి అంత చులకనా?

ఓ గిరిజన విద్యార్థి మరణించిన తరువాత ఎటువంటి శవ పంచనామా నిర్వహించకుండా, పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా గంజాయి వంటి మత్తుపదార్థాలు వినియోగించి మరణించాడని వైద్యారోగ్యశాఖ ఏ విధంగా ప్రకటన విడుదల చేస్తుందని స్థాని కులు ప్రశ్నిస్తున్నారు. ఆధారాలు లేకుండా, పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా ఎలా ప్రకటిస్తారని మృతుని తండ్రి ప్రశ్నిస్తున్నాడు. చనిపోయిన గిరిజన విద్యార్థిపై మాయని మచ్చను వేసే ప్రయత్నం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓ గిరిజన విద్యార్థి మరణమంటే అధికారులకు ఇంత చులకనా? అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు తెలుస్తాయని, సరైన ఆధారాలు విచారణ లేకుండా ఓ గిరిజన యువకుడి మరణంపై అధికారులు తప్పుడు నివేదికలు ఇవ్వవద్దని గిరిజన నాయకులు కోరుతున్నారు.

గిరిజన విద్యార్థి మరణంలో మతలబు

గంజాయి వినియోగంతో మరణించాడని ప్రకటించిన డీఎంహెచ్‌ఓ

గంజాయి మత్తుతో మరణం అవాస్తవమని ప్రకటించిన ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement